Satyabhama Serial Today Episode సత్య తన అత్తమామల 30వ పెళ్లి రోజు వేడుకల్ని జరుపుతుంది. ఆ వేడుకకు తన స్నేహితులు కూడా వస్తారు. సత్యతో తన తల్లి విశాలాక్షి అల్లుడు చాలా బాధ పడుతున్నాడని అంటుంది. సత్య తల్లిని కంగారు పడొద్దని తాను క్రిష్‌ని కానీ తన కుటుంబాన్ని కానీ దూరం చేసుకోనని చెప్తుంది. ఇక భైరవిని ఇద్దరూ కోడళ్లు, మహదేవయ్యని రుద్ర తీసుకొని పసుపు రాయడానికి తీసుకొస్తారు.
మహదేవయ్య, భైరవిలకు విశ్వనాథం, విశాలాక్షిలు పసుపు రాస్తారు. ఇక నందినిని మహాదేవయ్య పిలుస్తాడు. నందిని ముఖం మాడ్చుకుంటుంది. సంధ్య, హర్ష ఒప్పించి నందినిని తీసుకెళ్తారు. తర్వాత అందరూ ఇద్దరికీ పసుపు రాసి సందడి చేస్తారు. ఇక సత్య స్నేహితులు హల్దీలో ఎవరైనా వాళ్లకు నచ్చిన వాళ్లకి పసుపు రాయొచ్చని అంటారు. ముగ్గురు ఫ్రెండ్స్ సత్య వెంట పరుగులు తీస్తారు. తప్పించుకోవడానికి సత్య పరుగుందుకుంటుంది. ఇంతలో క్రిష్ వస్తే సత్య క్రిష్ వెనకాలే దాక్కుంటుంది. ఇంతలో సంధ్య వెంట పడటంతో ముగ్గురు ఫ్రెండ్స్ పారిపోతారు. ఇక సత్య ఎవరూ లేకపోవడంతో క్రిష్‌కి చందనం రాస్తుంది. నచ్చిన వారికి పసుపు రాయమని చెప్పారు నీకంటే నాకు నచ్చిన వారు ఎవరూ లేరని సత్య క్రిష్‌కి రాస్తుంది. తర్వాత క్రిష్ చేతికి పసుపు ఇచ్చి తనకు రాయమని చెప్తుంది. క్రిష్ రాస్తాడు. సత్య ఫ్రెండ్స్ ఆట పట్టిస్తారు. క్రిష్ సత్యతో నీ ఫ్రెండ్స్ ముందు నువ్వు సంతోషంగా ఉన్నావని అనుకోవాలనే ఇలా చేశావ్ కదా నేను కూడా నీ కోసం నటించాను నటిస్తానని అంటాడు. సత్య చాలా ఫీలవుతుంది.
ఇక నందిని, సంధ్య హర్షని వెంటపడి మరి గంధం పూస్తారు. ఇక ఆర్‌డీఎక్స్ గ్యాంగ్ రాధ, దీప్తి, జెనాలు సత్య దగ్గరకు వచ్చి క్రిష్ గంధం పూయడం సంతోషంగా ఉందని అంటారు. సత్య బుంగ మూతి పెట్టుకొని క్రిష్ తన గాలి తీసేశాడని ప్రేమని చూపిస్తే నీ ఫ్రెండ్స్ కోసం నటిస్తున్నావని అన్నాడని చెప్తుంది. ఇక దీప్తి సత్యతో క్రిష్ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూనే ఉండు అర్థమవుతుందని అంటుంది. ఇక మరోవైపు విశ్వనాథం, క్రిష్ దగ్గరకు వెళ్తాడు.
విశ్వనాథం: బాబు నీతో మాట్లాడాలి అని వచ్చాను. ఇది వరకు లాగా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నా. తెలియని ఇబ్బంది ఉంది.
క్రిష్: అట్లా ఏం లేదు. ఏం చెప్పాలి అనుకున్నారో చెప్పండి మామయ్య.
విశ్వనాథం: మా అమ్మాయికి నీకు మధ్య సమస్య ఏంటి బాబు. మీరిద్దరూ ఎందుకు దగ్గర అవ్వలేకపోతున్నారు. మనుషులు దగ్గరే ఉంటున్నారు. కానీ మనసులు దగ్గర కాలేకపోతున్నాయి. ఈ దూరానికి తప్పు సత్యదేనా.
క్రిష్: కలిసి నడుస్తున్నప్పుడు తప్పొప్పులు చూడకూడదు మామయ్య. ఇదంతా సత్యనే చేసింది మా బాపు చాలా కుషిగా ఉన్నాడు
విశ్వనాథం: మరి నువ్వు. మీ బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని మాట ఇవ్వగలవా.
క్రిష్: మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఒక్క వారం ఆగితే ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయిపోతాయి. అని క్రిష్ వెళ్లిపోతాడు.
రుద్ర సత్య కిడ్నాప్ గురించి రౌడీలతో మాట్లాడుతాడు. సత్య కిడ్నాప్ చేయాలనుకుంటున్న విషయం సత్య ఫ్రెండ్స్ వినేస్తారు. ఇక రౌడీలు బేరర్ అవతారం ఎత్తుతారు. వాళ్లని సత్య ఫ్రెండ్స్ గమనిస్తూ ఉంటారు. రౌడీలు సత్య ఫొటో పట్టుకొని సత్య కోసం తిరుగుతూ ఉంటారు. వాళ్లు చూడకుండా సత్య ఫ్రెండ్స్ సత్యని పిలిచేస్తారు. ఇక తన ఫ్రెండ్స్ రౌడీతో కాసేపు ఆడుకుందామని అనుకుంటారు. మాటి మాటికి వాడిని పిలిచి తిప్పిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.