Saptahik Rashifal 10 March to 16 March 2025: ఈ వారం ధనస్సు, మకరం, కుంభం, మీన రాశులకు సంబంధించి శుభ, అశుభ ఫలితాలు ఇక్కడ  చూసుకోండి...


ధనుస్సు రాశి  (Sagittarius Weekly Horoscope) 


ఈ వారం ధనస్సు రాశివారి కీర్తి పెరుగుతుంది, గౌరవం లభిస్తుంది. కుటుంబం గురించి గర్వంగా ఫీలవుతారు.  కొత్త ప్రేమ సంబంధాలు ప్రారంభమవుతాయి. మీ స్నేహితులు సమయానికి మీకు సహాయం చేస్తారు. ఉద్యోగులు ఉన్నాతాధికారుల నుంచి ప్రయోజనం పొందుతారు. పెద్ద వ్యాపార ఒప్పందాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సమయం కన్నా ముందే పూర్తవుతాయి. స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బు ప్రయోజనం పొందుతారు. అయితే..అనుకోని విషయాల్లో చిక్కుకుని సమయం వృధా చేస్తారు. తల్లిదండ్రుల గురించి ఆందోళన చెందుతారు. చిన్న విషయాలను నిశితంగా అంచనా వేయడం కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. డబ్బు లావాదేవీలో మీరు జాగ్రత్తగా ఉండాలి.  వారాంతంలో కొత్త రచనలను ప్రారంభించకూడదు.


Also Read: Weekly Horoscope 10 To 16 March 2025: ఈ రాశులవారి ఆదాయం పెరుగుతుంది కానీ అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి - మార్చి 10 to 16 వారఫలాలు!


మకర రాశి (Capricorn Weekly  Horoscope)


మీ పరిచయాల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. దగ్గరి బంధువులతో మీ బంధం మెరుగుపడుతుంది. స్నేహితులు , బంధువుల కోసం సమయం తీసుకోవాలి. వ్యాపార సంబంధిత వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం  మెరుగుపడుతుంది. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులపై ఉన్నత అధికారుల ఒత్తిడి తగ్గుతుంది. మీరు మీ ఫీల్డ్‌లో కొన్ని మార్పులు చేయవచ్చు. ఈ వారం వ్యవసాయ పనులతో సంబంధం ఉన్నవారికి మంచిది. కుటుంబ తగాదాలు పరిష్కారం అవుతాయి. రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి కొన్ని సమస్యలుంటాయి. ఈ రాశివారు వివాహేతర వ్యవహారాల నుంచి పూర్తి దూరం పాటించడం మంచింది. మీ రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. వారం ప్రారంభంలో, మీరు కొన్ని పనుల గురించి గందరగోళంగా ఉండవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో అలసత్వం వద్దు.


కుంభ రాశి  (Aquarius  Weekly Horoscope) 


ఈ వారం మీరు కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపిస్తారు. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. నూతన పెట్టుబడి మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బిజీగా ఉన్నప్పటికీ ఇల్లు, కుటుంబం కోసం కొంత సమయం తీసుకుంటారు. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. విద్యార్థులు వారి అధ్యయనాలపై చాలా దృష్టి పెడతారు.  సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్ట్ ఫీల్డ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు గౌరవం పొందుతారు. ఈ వారం పరిశోధన పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. మీ సామర్థ్యంపై విశ్వాసం ఉంచండి.  సాంకేతిక విద్యలో ఉండేవారు తమ ఉపాధి గురించి ఆందోళన చెందుతారు. ప్రతికూల ధోరణి ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండడం మంచిది. సంభాషణ సమయంలో సున్నితమైన భాషను ఉపయోగించండి.  ప్రేమికుల మధ్య తగాదాలు ఉండే అవకాశం ఉంది. అప్పులు చేయడం వల్ల భవిష్యత్ లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు.


Also Read: ఈ వారం ఈ రాశులవారి ఫ్యూచర్ కీలక మలుపు తిరుగుతుంది.. వ్యక్తిగత జీవితంలో అంతా సంతోషమే!


మీన రాశి (Pisces  Weekly Horoscope) 


ఈ వారం ప్రారంభంలో మీనరాశివారికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆగిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. నూతన  పెట్టుబడి పెట్టడానికి సమయం మంచిది. విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. ఈ వారం మీరు మీ ఆహార అలవాట్లను మార్చవచ్చు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలి అనుకుంటే ఇది శుభసమయమే. చట్టపరమైన వివాదాల నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ముఖ్యమైన పని కోసం రుణాలు తీసుకోవలసి ఉంటుంది. ఆరోగ్య సమస్యలను తేలికగా తీసుకోకుండా సరైన చికిత్స తీసుకోండి. అధిక విశ్వాసం కారణంగా మీరు ఇబ్బందుల్లో పడతారు. 


Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!


మీ నక్షత్రం ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...