Saptahik Rashifal 10 March to 16 March 2025: ఈ వారం మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులకు సంబంధించి శుభ, అశుభ ఫలితాలు చూసుకోండి...

మేష రాశి (Aries  Weekly Horoscope) 


ఈ వారం ఆరంభం చాలా బాగుంటుంది. వ్యాపారంలో ప్రత్యర్థులకు మంచి పోటీ ఇస్తారు. ఉన్నతాధికారుల నుంచి గౌరవం పొందుతారు.  విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ మనస్సులో కొత్త ఆలోచనలు తలెత్తుతాయి. ఉద్యోగంలో మార్పిడి చేసే బలమైన అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. వారం ఆరంభం బావుంటుంది. వారం సెకెండాఫ్ కొన్ని సమస్యలు ఉండొచ్చు. మత్తుపదార్థాలపై శ్రద్ధ  పెరుగుతుంది. మీగురించి మీ సన్నిహితులకు కొన్ని అపోహలు ఉంటాయి. మీ ప్రతిష్టకు భంగం కలుగుతుంది.


Also Read: Ugadi 2025 Aadayam Vyayam : ఉగాది 2025 విశ్వావసు నామసంవత్సరంలో మీ రాశి ప్రకారం ఆదాయం - వ్యయం తెలుసుకోండి!


వృషభ రాశి (Taurus  Weekly Horoscope)


మీకు ఈ వారం అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కొన్ని కారణాల వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి కానీ వాటిని అధిగమిస్తారు. ప్రియమైనవారితో ప్రయాణం చేస్తారు. వ్యాపారంలో పురోగతి ఉత్సాహాన్నిస్తుంది. మీరు భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది.  ఆరోగ్య సేవల రంగంలో ఉండే వారికి గౌరవం పెరుగుతుంది. బుధవారం తర్వాత సమయం చాలా బాగుంటుంది. వారం ప్రారంభంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. అంచనా కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది.  భూ ఒప్పందాలలో నిర్లక్ష్యం సమస్యగా మారుతుంది. కోపాన్ని తగ్గించుకోవాలి.
 
మిథున రాశి (Gemini  Weekly Horoscope) 


భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. మీరున్న రంగంలో మంచి అవకాశాలు పొందుతారు. పూర్వీకుల ఆస్తులు కలిసొస్తాయి. స్నేహితులతో బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది.  విద్యార్థులు ముఖ్యమైన ప్రాజెక్టులను ప్లాన్ చేయవచ్చు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఈ వారం  శుభప్రదమైనది. ఆర్థిక రంగంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి. సంభాషణ ద్వారా మీరు కొన్ని సమస్యలను అధిగమించవచ్చు. వారం సెకెండాఫ్ లో ఓ గుడ్ న్యూస్ వింటారు. వ్యక్తిగత పనులతో విసిగిపోతారు.  అంగారక గ్రహ మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చట్టపరమైన విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సహనం తగ్గడం వల్ల మీరు అవకాశాల నుంచి  గొప్ప ప్రయోజనాన్ని పొందలేరు..ఓపికగా వ్యవహరించండి.


Also Read: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రానికి ఎన్ని సున్నాలు ఉన్నాయి.. ఉంటే ఏమవుతుంది!


కర్కాటక రాశి (Cancer  Weekly Horoscope)  


ఈ వారం టైమ్ మీకు కలిసొస్తుంది. వ్యాపార ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. కుటుంబంలో పరస్పర సామరస్యం, ప్రేమ  పెరుగుతుంది. మీరు అనుకున్నవన్నీ పూర్తిచేస్తారు. అధ్యయనాలను మెరుగుపరిచే అవకాశం ఉంది. డయాబెటిస్ , కాలేయ రోగులకు కొంత ఉపశమనం లభిస్తుంది. మతంపై మీ విశ్వాసం పెరుగుతుంది. మనసు సంతోషంగా ఉంటుంది. మీ నిర్ణయం సామర్థ్యం ఓ ప్రశ్నగా మారుతుంది.  ఖరీదైన వస్తువుల కొనుగోలు బడ్జెట్‌ను ప్రభావితం చేస్తుంది. ఎలక్ట్రికల్ పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించండి. వారం మధ్యలో ఉన్నతాధికారులతో చర్చలు జరుగుతాయి. 


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!


మీ నక్షత్రం ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...