Nandamuri Kalyan Ram's 21st film titled Arjun S/O Vyjayanthi: నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా, సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా టైటిల్ ఈరోజు అనౌన్స్ చేశారు. 


అర్జున్ సన్నాఫ్ వైజయంతి...
మహిళా దినోత్సవం సందర్భంగా!
కథానాయకుడిగా నందమూరి కళ్యాణ్ రామ్ 21వ చిత్రమిది. సో... వర్కింగ్ టైటిల్ #NKR21 అని వ్యవహరించేవారు. ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' టైటిల్ ఖరారు చేసినట్లు తెలిపారు. 


ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే... మండుతున్న జ్వాలల మధ్య విజయశాంతి, కళ్యాణ్ రామ్ దృఢ సంకల్పంతో నడుస్తున్నట్లు కనిపించింది ఒక ఫ్యాక్టరీ ముందు చెల్లాచెదరుగా ఉన్న ఇనుప గొలుసులు కనిపించాయి. కథకు వాటికి సంబంధం ఏమిటో మరి? ఖాకి దుస్తుల్లో విజయశాంతి, పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్సిటీతో కళ్యాణ్ రామ్ కనిపించిన పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది.


Also Readమళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్... 'చిన్ని'లో కావ్యతో పాటు నిఖిల్ కూడా






'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'లో ఐపీఎస్ అధికారిగా శక్తివంతమైన పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు. ఆవిడ సూపర్ హిట్ సినిమాలలో ఒకటైన 'కర్తవ్యం'లోనూ ఆమె క్యారెక్టర్ పేరు వైజయంతి. అందులోనూ ఆవిడది ఐపీఎస్ అధికారి పాత్ర.‌ ఆ సినిమా 1990లో విడుదల అయింది. సుమారు 35 ఏళ్ల తర్వాత మరొకసారి ఐకానిక్ క్యారెక్టర్, అదే పేరుతో విజయశాంతి చేస్తున్నారంటే సంథింగ్ స్పెషల్ అనేలా ఉంటుందని చెప్పవచ్చు. 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' టైటిల్ బట్టి వైజయంతి అలియాస్ విజయశాంతి కొడుకుగా అర్జున్ అలియాస్ నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్నారని ప్రేక్షకులు ఈజీగా అర్థం చేసుకుంటారు. 


నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ చూస్తే భారీ హిట్స్ ఉన్నాయి. రిస్క్ తీసుకుని ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' కూడా అటువంటి సినిమా అని ఇండస్ట్రీ టాక్‌. ఈ చిత్రానికి 50 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల మీద అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు భారీ స్థాయిలో ప్రొడ్యూస్ చేస్తున్నారు.


Also Readఆంధ్ర కింగ్ తాలూకా... రామ్ పోతినేని కొత్త సినిమా టైటిల్ వింటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా గుర్తుకు వస్తుందా?


'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్ కాగా...  సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్, యానిమల్ ఫేమ్ పృథ్వీ వీరాజ్ ఇతర పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రామ్ ప్రసాద్, కూర్పు: తమ్మి రాజు, కళా దర్శకత్వం: బ్రహ్మ కడలి, సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి, స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్.