Amrutham Seiral Episode 4 Review: 90sలో వచ్చిన 'అమృతం' సీరియల్ (Amrutham Serial) అంటే ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్. గుణ్ణం గంగరాజు దర్శకత్వం రూపొందించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో శివాజీరాజా, నరేశ్, హర్షవర్ధన్, గుండు హనుమంతరావు, వాసు ఇంటూరి, నారిపెద్ది శివన్నారాయణ, నరేశ్, రాగిణి, ఝూన్సీ కీలక పాత్రలు పోషించారు. కొన్ని ఎపిసోడ్స్‌లో కీరవాణి సోదరుడు, ప్రముఖ రచయిత SS కాంచి కూడా తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. పిల్లల నుంచి పెద్దల వరకూ కుటుంబమంతా కలిసి చూసుకుని హాయిగా నవ్వుకుని కాస్త రిలాక్స్ కావొచ్చు. 'అమృతం' రోల్‌లో తొలుత శివాజీ రాజా, ఆ తర్వాత నరేశ్, ఆయన తర్వాత హర్షవర్ధన్ నటించి మెప్పించారు. ఇక అమృతం స్నేహితుడు 'అంజి'గా గుండు హనుమంతరావు రోల్ బుల్లితెర ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ ఓ చెరగని ముద్ర వేసింది. అమృత హాస్యంగా ఆయన ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. అంజి భార్య శాంతగా రాగిణి.. ఎప్పుడూ పెనాల్టీలు వేస్తూ టెనెంట్స్‌ను ఇబ్బంది పెట్టే అప్పాజీ రోల్‌లో శివన్నారాయణ మెప్పించారు. అలాంటి హాస్య రసామృతాన్ని మళ్లీ మీకు గుర్తుకుతెస్తూ ఆ కామెడీ సీరియల్ ఎపిసోడ్స్ మీకోసం..
అమృతంతో మేనేజర్‌కు ఎన్ని తిప్పలో తెలుసా..?
అంజి పక్క ఇంట్లో అమృతం దిగగా.. ఆవు పేడతో గ్రాండ్ ఎంట్రీగా గృహప్రవేశం చేస్తారు. 'గజ విరోచ్' ఆముదం తిన్న ఆవు పేడ వేయగా దీని వల్ల ఇంటి ఓనర్ అప్పాజీ గాయపడతాడు. ఇక రెండో ఎపిసోడ్‌లో అనంతరం ఫోన్ కనెక్షన్ల వల్ల రాంగ్ కాల్స్ ఇబ్బంది పెట్టగా.. అంజి, అమృతం ఒకరికి తెలియకుండానే మరొకరు సవాల్ చేసుకుంటూ నవ్వులు పూయిస్తారు. ఇక మూడో ఎపిసోడ్ 'భౌ భౌ సాగరం' విషయానికొస్తే..
అమృతం కొత్త ఇంట్లో దిగిన తర్వాత ఫస్ట్ టైం ఆఫీసుకు వెళ్తాడు. దేవునికి దండం పెట్టుకుని వెళ్లాలని సంజీవని చెప్పగా అమృతం పట్టించుకోడు. ఆఫీసుకు వెళ్లబోతుండగా బైక్ స్టార్ట్ కాదు. దీంతో మళ్లీ దేవునికి దండం పెట్టుకుని వెళ్తుండగా అంజి బైక్ ప్లగ్ తీసుకెళ్లానని చెబుతాడు. దీంతో చిరు కోపంతో అమృతం ఆఫీసుకు వెళ్తాడు. 'భౌ భౌ' కుక్క బిస్కెట్ల కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేసే అమృతం ఆఫీసుకు లేట్‌గా రావడం చూసి మేనేజర్ అంభుజనాభం మండిపడతాడు. ఈ క్రమంలోనే ఆ కంపెనీ బిస్కెట్లు తిన్న తమ కుక్క పిల్లిలా అరుస్తుందని ఓ మహిళ తన లాయర్‌తో రాగా.. వారితో చిన్నపాటి గొడవ జరుగుతుంది. దీంతో లాయర్ కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు కంపెనీపై కంప్లైంట్ ఇస్తాడు.
స్టాక్ చెక్ చేద్దామని వచ్చిన ఆఫీసర్స్‌కు ఒక్క ప్యాకెట్ తేడా కనిపిస్తుంది. ఆ ప్యాకెట్ ఎక్కువ వచ్చిందని భావించిన అమృతం అది మీ టేబుల్ మీదే ఉందని ఎక్కడైనా దాచేయాలని చెబితే అది కుదరదంటాడు అంబుజనాభం. దీంతో తినేయాలని సలహా ఇవ్వగా ఆ ప్యాకెట్ తినేందుకు అంబుజనాభం ప్రయత్నిస్తాడు. అయితే, అదే ప్యాకెట్ తక్కువ వచ్చిందని ఆఫీసర్స్ అతనికి చెప్పి.. ఆ ప్యాకెట్ చూసి స్టాక్ ఫర్ఫెక్ట్‌గా ఉందంటూ వెళ్లిపోతారు. అనవసరంగా కుక్క బిస్కెట్లు తినిపించావంటూ మేనేజర్ మండిపడగా అమృతం షాక్ అవుతాడు. పాపం.. అమృతం వల్ల మేనేజర్‌కు ఎన్ని తిప్పలో కదా.. ఈ ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చెయ్యండి.