'3 Roses' Web Series Season 2 Teaser Released: టాలీవుడ్ హీరోయిన్స్ పాయల్ రాజ్‌పుత్, ఈషారెబ్బా, పూర్ణ లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ 'త్రీ రోజెస్' (3 Roses). ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్ సీజన్ 2 త్వరలోనే 'ఆహా' (Aha) ఓటీటీలోకి స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా.. ఈ సిరీస్‌ టీజర్ రిలీజ్ కాగా నవ్వులు పూయిస్తోంది. ఈ సీజన్‌లో హర్ష చెముడు, సంగీత్ శోభన్, హర్ష చెముడు, ప్రిన్స్, సాయిరోనక్, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'రోజెస్ తిరిగివచ్చాయి, ఈసారి రెట్టింపు ఆనందం, అంతులేని వినోదంతో వికసిస్తున్నాయి! రెండు ఆశ్చర్యకరమైన రోజెస్ మరింత క్రేజ్ తెస్తున్నాయి! ఎవరు సిద్ధంగా ఉన్నారు?' ఉన్నారు అంటూ ఆహా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

ఈసారి 2 కొత్త రోజెస్..

టీజర్‌లో వైవా హర్ష, ఈషా కామెడీ టైమింగ్ అదిరింది. 'ఏంటీ నీ వేస్ట్ బ్యాచ్.. మిగిలిన 2 రోజెస్ ఎక్కడ..?' అంటూ హర్ష అడగ్గా.. 'ఒకామెకు పెళ్లయిపోయింది. ఇంకొకామె టూర్స్ అంటూ తిరుగుతుంది.' అని ఈషా చెప్పగా.. నువ్వేమో ఇలా సింగిల్ చింతకాయలా మిగిలిపోయావ్ అంటూ సెటైర్లు వేస్తాడు. దీనికి 'ఒక్కదాన్నే అని ఎవరు చెప్పారు. ఇప్పుడు కూడా ఇద్దరున్నారు.' అని అనగా.. 'అంటే 2 కొత్త రోజెస్' అంటూ హర్ష ప్రశ్నించగా.. 'హా ఈసారి ఫన్ మామూలుగా ఉండదు.' అంటూ సిరీస్‌పై హైప్‌ను పెంచేశారు. ఎవరు ఆ కొత్త 2 రోజెస్ అంటూ ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. మరి ఆ రోజెస్ ఎవరో తెలియాలంటే సిరీస్ రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే. 

Also Read: 'కోర్ట్' మూవీ నచ్చకుంటే నా 'హిట్ 3' చూడొద్దు - ఆ రెండింటికీ లింక్ పెట్టిన నేచురల్ స్టార్ 'నాని'.. ఎందుకో తెలుసా..?

ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ

టాలీవుడ్ డైరెక్టర్ 'మారుతి'.. '3 రోజెస్' సీజన్‌ను రూపొందించారు. ముగ్గురమ్మాయిల చుట్టూ తిరిగే కథతో వచ్చిన ఫస్ట్ సిరీస్ ఇదే కాగా.. 2021లో విడుదలైన సీజన్ 1 మంచి రెస్పాన్స్ అందుకుంది. మారుతి షో రన్నర్‌గా వ్యవహరించగా.. మాగి డైరెక్ట్ చేశారు. బేబీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ సిరీస్ నిర్మించారు. యాడ్ ఏజెన్సీలో పని చేసే రీతూకు (ఈషా రెబ్బా) పెళ్లి చేయాలని తల్లి భావిస్తుండగా.. తప్పించుకుని తిరుగుతుంటుంది. పెళ్లికి ముందే డేటింగ్‌లో ఉన్న జాహ్నవి (పాయల్ రాజ్‌పుత్) అందులో తప్పేం లేదని భావిస్తుంది. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాని ఇందును (పూర్ణ) తన కంటే వయసులో చిన్నవాడైన యువకుడు ప్రేమిస్తుంటాడు. వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ముగ్గురమ్మాయిల చుట్టూ సాగే స్టోరీకి ఎమోషన్స్, రొమాన్స్, కామెడీని జోడించి దర్శకుడు సిరీస్‌ను అందంగా తెరకెక్కించారు. ఇప్పుడు మరోసారి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు సీజన్ 2 రాబోతోంది. త్వరలోనే 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. కొత్త సీజన్ మరికొన్ని పాత్రలు సైతం అలరించబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి