Nani Comments Viral In Court Movie Pre Release Event: 'కోర్ట్' మూవీ నచ్చకుంటే తన 'హిట్ 3' (HIT 3) మూవీ ఎవరూ చూడొద్దని నేచురల్ స్టార్ నాని (Nani) అన్నారు. 'కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' (Court: State Versus A Nobody) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఈ నెల 14న 'దయచేసి అందరూ థియేటర్‌కు వెళ్లండి.' అని అన్నారు. 'ఈ రోజుల్లో సినిమాల్లోకి దూరిపోయి.. అందులోని పాత్రల ఎమోషన్‌తో కనెక్ట్ అయిపోయి.. ఆ చిత్ర ప్రపంచాల్లోకి తీసుకెళ్లే కథలు బాగా తగ్గిపోయాయి. కానీ.. 'కోర్ట్' మూవీతో నేను ఆ అనుభూతిన పొందగలిగాను. ఆ అనుభూతిని ప్రేక్షకులు కూడా పొందాలనేదే నా తాపత్రయం. ఈ సినిమా తెలుగులో ఓ గొప్ప కోర్ట్ రూం డ్రామాగా నిలిచిపోతుంది. నా 16 ఏళ్ల సినీ కెరీర్‌లో 'దయచేసి సినిమా చూడండి' అని నేనెప్పుడూ ఎవరినీ అడిగింది లేదు. కానీ ఈ చిత్రం విషయంలో ఆ మాట అడుగుతున్నా.
ఇలాంటి మంచి సినిమాను తెలుగు ఆడియన్స్ ఎవరూ మిస్ కాకూడదనే ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మీ అంచనాల్ని అందుకోలేదని అనిపిస్తే మరో 2 నెలల్లో విడుదల కానున్న 'నా హిట్ 3' సినిమాను ఎవరూ చూడొద్దు. ఈ నెల 14 వరకే 'కోర్ట్' సినిమా చూడాలని అందరికీ చెప్తాను. ఆ తర్వాత నుంచి మీరే ఆ మాట ప్రతీ ఒక్కరికీ చెప్తారు.' అని నాని పేర్కొన్నారు.
ఆకట్టుకుంటోన్న 'కోర్ట్' ట్రైలర్
నేచురల్ స్టార్ నాని (Nani) వాల్ పోస్టర్ బ్యానర్ సమర్పణలో యంగ్ హీరో ప్రియదర్శి లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'కోర్ట్: ది స్టేట్ వర్సెస్ నోబడీ' (Court: The State Versus Nobody). ఈ మూవీతో రామ్ జగదీశ్ దర్శకుడిగా మారగా.. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. సినిమాలో హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించగా.. శివాజి, సాయికుమార్, హర్షవర్ధన్, రోహిణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హోలీ సందర్భంగా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది. 'కోర్ట్' రూం బ్యాక్ డ్రాప్‌లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, పవర్ ఫుల్ డ్రామాగా మూవీ తెరకెక్కగా.. శుక్రవారం విడుదలైన సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 'ఓ సాధారణ కుటుంబానికి చెందిన యువకుడు.. సొసైటీలో బాగా డబ్బు, పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి కూతురు ప్రేమలో పడతారు. ఈ క్రమంలోనే తన కూతురిని వేధిస్తున్నాడని యువకున్ని అరెస్ట్ చేయించిన యువతి తండ్రి.. పోక్సో కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు బనాయించేలా చేస్తాడు. అయితే.. యువకుడి తరఫున వాదించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అతని ఫ్యామిలీ ఆవేదనకు గురవుతారు. చివరకు ఓ ప్రముఖ లాయర్ కింద జూనియర్‌గా పని చేసే యువ లాయర్ యువకుడి కేస్ టేకప్ చేస్తాడు. ఈ క్రమంలో ఎదురైన పరిణామాలేంటి..?.' అనేదే కోర్ట్ స్టోరీగా ఉండనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.