Amrutham Serial: 'ఒరేయ్ అమృతం ఎందుకిలా చేశావ్?' - ఫోన్‌తో ఆంజనేయులు, అమృతం అల్లరి మామూలుగా లేదుగా?.. ఇక నవ్వులే నవ్వులు

Amrutham Serial Review: 90sలో వచ్చిన 'అమృతం' సీరియల్ ఎప్పటికీ పిల్లల నుంచి పెద్దల వరకూ ఎప్పటికీ ఓ ప్రత్యేకమే. ఈ సీరియల్‌ ఎపిసోడ్స్ మళ్లీ మీ కోసం..

Continues below advertisement

Amrutham Serial Episode 2 Review: నవ్వడం ఓ భోగం, నవ్వించడం ఓ యోగం, నవ్వలేకపోవడం ఓ రోగం అనే సామెత అందరికీ తెలిసిందే.  రోజులో ఒక్కసారైనా మనస్ఫూర్తిగా నవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలా.. మీరు హార్ట్ ఫుల్‌గా నవ్వుకుంటూ మీ ఒత్తిడిని తగ్గించే బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ సీరియల్ 'అమృతం' (Amrutham). 90sలో వచ్చిన ఈ కామెడీ సీరియల్ ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకూ కుటుంబమంతా కలిసి చూసుకుని హాయిగా నవ్వుకుని కాస్త రిలాక్స్ కావొచ్చు. గుణ్ణం గంగరాజు సృష్టించిన ఈ హాస్య రసామృతం దాదాపు ఆరేళ్లు పాటు విజయవంతంగా టెలికాస్ట్ కాగా.. శివాజీరాజా, నరేశ్, హర్షవర్ధన్, గుండు హనుమంతరావు, వాసు ఇంటూరి, నారిపెద్ది శివన్నారాయణ, నరేశ్, రాగిణి, ఝూన్సీ కీలక పాత్రలు పోషించారు. 

Continues below advertisement

సీరియల్‌లో 'అమృతం' రోల్‌లో తొలుత శివాజీ రాజా, ఆ తర్వాత నరేశ్, ఆయన తర్వాత హర్షవర్ధన్ నటించి మెప్పించారు. ఇక అమృతం స్నేహితుడు 'అంజి'గా గుండు హనుమంతరావు రోల్ బుల్లితెర ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ ఓ చెరగని ముద్ర వేసింది. అమృత హాస్యంగా ఆయన ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. ఆయన భార్య శాంతగా రాగిణి, పెనాల్టీల మీద పెనాల్టీలు వేసి టెనెంట్స్‌ను పీల్చి పిప్పి చేస్తూ నవ్వులు పూయించే 'అప్పాజీ' రోల్‌లో నారిపెద్ది శివన్నారాయణ నటన ఎప్పటికీ ఓ అద్భుతమే. అలాంటి అద్భుత హాస్యాన్ని మళ్లీ మీకు అందించాలనే ఆ ఎపిసోడ్స్ మీ కోసం..

Also Read: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ 'తండేల్' - ఒకే రోజు స్ట్రీమింగ్ అవుతోన్న 20 సినిమాలు.. చూసి ఎంజాయ్ చెయ్యండి!

రాంగ్ కాల్ ఎంత పని చేసిందో చూశారా..?

ఫస్ట్ ఎపిసోడ్ 'గో గృహప్రవేశం'లో అంజి పక్క వాటాలోకి అమృతం దిగుతాడు. అయితే, ఇంట్లో దిగే ముందు గోవుతో గృహ ప్రవేశం చేయాలని అంజి చెప్పగా అమృతం దంపతులు ఓకే అంటారు. ఈ క్రమంలోనే ఓ ఆవును తీసుకొచ్చి ఇల్లంతా కలియదిప్పుతారు. అయితే, ఎంత ప్రయత్నించినా అది పేడ మాత్రం వేయదు. దీంతో ఆవుకు 'గజ విరోచ్' అనే ఏనుగుల కోసం వాడే ఆముదం పట్టిస్తాడు అంజి. ఈ లోపు ఇంటి విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టే అప్పాజీ ఆ ఇంటికి వస్తాడు. అతనలా ఇంట్లో ఎంటర్ కాగానే ఆవు పేడ వల్ల గాయపడతాడు. ఆద్యంతం నవ్వులు పూయించే ఈ ఎపిసోడ్‌కు కొనసాగింపుగా 'మై డియర్ రాంగ్ నెంబర్' ఎపిసోడ్ సైతం నవ్వులు పూయిస్తుంది.

ఈ ఎపిసోడ్‌లో అమృతం ఇంటికి ఉదయాన్నే ఫోన్ వస్తుంది. అంజి భార్య శాంత కొలీగ్ ఫోన్ చేసి తాను ఈ రోజు ఆఫీస్‌కి రావడం లేదని ఈ విషయం ఆమెకు చెప్పాలనగా విసుక్కుంటూ అమృతం ఫోన్ పెట్టేస్తాడు. ఈ లోపు అంజి ఇంటికి కూడా కొత్త ఫోన్ పెట్టిస్తారు. ఈ విషయాన్ని అమృతం ఇంటికి వచ్చిన అంజి స్వీట్ ఇచ్చి మరీ చెప్తాడు. అయితే, కనెక్షన్ల ప్రాబ్లమ్ వల్ల అంజి ఏ నెంబర్‌కు చేసినా అది అమృతంకు వెళ్తుంది. ఇదే సమయంలో అమృతం తన ఇంటి నెంబర్‌కు చేస్తే అది అంజికి వెళ్తుంది. అలా శాంతతో ఏదేదో మాట్లాడగా.. అంజి కోపంతో సవాల్ చేస్తాడు. ఇలా ఒకరికొకరు తెలియకుండానే అంజి, అమృతం సవాల్ చేసుకుంటారు. ఇక ఈ రాంగ్ కాల్ భాగోతం ఏ కంచికి చేరిందో తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే..

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రితో ఎంగిలి ప్లేట్లు కడిగించిన కార్తీక్.. ఫుల్ కామెడీ.. రొమాన్స్!!

Continues below advertisement