Naga Chaitanya's Thandel OTT Streaming On Netflix: టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ 'తండేల్' (Thandel) ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో (Netflix) స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మూవీ అందుబాటులోకి వచ్చింది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజై రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ మూవీకి అల్లు అరవింద్ సమర్పణలో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు నిర్మించారు. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల జీవితాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. 

'తండేల్' కథేంటంటే..?

శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన 22 మంది మత్స్యకారులు తండేల్ 'రాజు' (నాగచైతన్య) ఆధ్వర్యంలో చేపలవేటకు వెళ్తుంటారు. మత్స్యకారులందరినీ నడిపించే నాయకుడి పేరే తండేల్. అతనికి చిన్ననాటి స్నేహితురాలు సత్య (సాయిపల్లవి) అంటే ప్రాణం. ఆమె కూడా రాజు అంటే అమితంగా ఇష్టపడుతుంది. 9 నెలలు సముద్రంలో చేపల వేటకు వెళ్లి.. అనంతరం 3 నెలలు ఊరిలో గడుపుతుంటారు. ఈసారి వేటకు వెళ్లొచ్చి సత్యను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు రాజు. అయితే, 22 మందితో చేపల వేటకు వెళ్లి పొరపాటును పాక్ సముద్ర జలాల్లోకి ప్రవేశించగా.. అక్కడి కోస్ట్ గార్డ్ అధికారులు పట్టుకుంటారు. ఈ విషయం తెలిసిన సత్య ఏం చేసింది.? రాజుతో పాటు ఆ మత్స్యకారులందరినీ కాపాడేందుకు ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి.? ఆ కుటుంబాలకు అండగా నిలబడేందుకు ఆమె చేసిన సాహసం ఏంటి.? అనేది తెలియాలంటే 'తండేల్' చూడాల్సిందే. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకే హైలెట్‌గా నిలిచింది.

Also Read: 'నా భర్తతో ఎలాంటి మనస్పర్థలు లేవు' - తప్పుడు ప్రచారం చెయ్యొద్దన్న సింగర్ కల్పన, వీడియో విడుదల

ఒకే రోజు మరిన్ని సినిమాలు..

మరోవైపు, ఒకేరోజు 20 సినిమాలు పలు ఓటీటీ ప్లాట్ ఫాంల్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అందులో 4 తెలుగు సినిమాలు ఉన్నాయి. అవి ఏంటంటే..

  • నెట్ ఫ్లిక్స్ - తండేల్, నాదానియన్
  • అమెజాన్ ప్రైమ్ - శర్వానంద్ 'మనమే', విశ్వక్ సేన్ 'లైలా', అక్షయ్ కుమార్ 'స్కైఫోర్స్', ఎఫ్ మ్యారీ కిల్
  • సోనీలివ్ - మిస్టరీ థ్రిల్లర్ 'రేఖాచిత్రం'
  • జియో హాట్ స్టార్ - బాపు, ఫతే, కట్ త్రోట్ సిటీ, డెలిసియస్
  • జీ5 - కుడుంబస్తాన్ (తమిళం/తెలుగు), గేమ్ ఛేంజర్ (హిందీ)
  • ఆహా - విశ్వక్ సేన్ 'లైలా', కుళంతైగల్ మునేత్రకళగం
  • లయన్స్ గేట్ ప్లే - డొమినిక్

వీటితో పాటే పలు సినిమాలు సైతం శుక్రవారం థియేటర్లలో సందడి చేయనున్నాయి. టైమ్ లూప్ హారర్ కాన్సెప్ట్‌తో కన్నడ హీరో ప్రజ్వల్ దేవరాజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'రాక్షస' కన్నడతో పాటు తెలుగులోనూ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం రిలీజ్ కానుంది. హీరో హీరోయిన్ల ముఖాలు చూపించకుండా తెరకెక్కించిన మూవీ 'రా రాజా', సుమన్ తల్వార్ లీడ్ రోల్‌లో నటించిన 'పౌరుషం', కమెడియన్ రాంప్రసాద్ నటించిన 'వైఫ్ ఆఫ్ అనిర్వేష్', ఆనంది లీడ్ రోల్‌లో నటించిన 'శివంగి', 'నీరుకుళ్ల', '14 డేస్ గర్ల్ ఫ్రెండ్' సినిమాలు రిలీజ్ కానున్నాయి. అటు, మహేష్ బాబు, వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీ రిలీజ్ కానుంది.

Also Read: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ 'ది సీక్రెట్ ఆఫ్ వుమెన్' - ఇద్దరు మహిళల జీవితాల్లో జరిగిన అనూహ్య పరిణామాలేంటో తెలియాలంటే..?