Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ రేవతికి కాల్ చేస్తుంది. చెప్పండి మహాలక్ష్మీ వదిన గారు అని దీర్ఘం తీసుస్తుంది. వెటకారం వద్దని మహాలక్ష్మీ అంటుంది. నువ్వు నీ భర్త కలిసి సీతని మా ఇంటి మీదకి పంపారా అని అడుగుతుంది. మీరు ఇలా మాట్లాడుతున్నారంటే పెద్ద ఝలకే ఇచ్చుంటుందని అంటుంది. మహాలక్ష్మీ బీట్ రూట్‌ బాంబ్ గురించి చెప్తే రేవతి, కిరణ్ నవ్వుతారు. దాంతో మహాలక్ష్మీ ఫోన్ కట్ చేసేస్తుంది. 


సీత రావడంతో ఇద్దరూ సీతతో మహాలక్ష్మీ, అర్చనల్ని అదరగొట్టావని అంటే ఏం లాభం పిన్ని రామ్ మామ దగ్గర ఓడిపోయాను మామ మనసు మెల్లగా మారిపోతుందని అని చెప్పి బాధ పడి గదిలోకి వెళ్లి డోర్ వేసుకుంటుంది. గదిలో సీత బాధ పడుతుంది. రామ్ మాటలు గుర్తు చేసుకొని ఏడుస్తుంది.  మహాలక్ష్మీ ఆరు బయట ఉంటే గౌతమ్ వచ్చి ఏంటి మామ్ టెన్షన్ పడుతున్నావ్ అంటే సీత, రేవతి, కిరణ్లు ముగ్గురు ఒక్కటై టెన్షన్ పెడుతున్నారని అంటుంది. సీతకి జాతర చేయాలా అని అడుగుతాడు. మహాలక్ష్మీ కొడుకుని తిడుతుంది. సీతకి నీ మీద అనుమానం ఉంది రామ్, జనాలకు కూడా నీ మీద అనుమానం వస్తే నీ పని అయిపోతుంది. సీత నీకు జాతర చేయాలని అంటాడు. సీతకు జాతర చేస్తే నువ్వు భయం నుంచి బయటకు వస్తావని అంటాడు. 


రామ్ తనని దూరం పెడుతున్నందుకు సీత ఏడుస్తుంది. త్వరగా తన మామ తనని దగ్గర తీసుకోవానలి కోరుతుంది. సుమతి ఫొటో దగ్గర దీపం ఉంటే అక్కడికి గౌతమ్ వచ్చి అతి త్వరతలో నీలాగే సీత ఫొటోకి కూడా దండ వేస్తానని అంటాడు. అప్పుడే పెద్ద గాలి వచ్చి ఫొటో నుంచి విద్యాదేవి ఆత్మ వచ్చి గౌతమ్ గొంతు పట్టుకొని నలిపేస్తూ నన్ను చంపింది చాలక నా మేనకోడలిని కూడా చంపుతా అంటావా అని గౌతమ్‌ని నలిపేస్తుంది. తర్వాత గౌతమ్ ఆ ఫొటో ఇంట్లో ఉంటే ఇలాంటి భయాలే వస్తాయని ఫొటో తీసి బయటకు విసిరేస్తాడు. ఆ ఫోటో రామ్ కాల దగ్గర పడుతుంది. రామ్ కోపంగా గౌతమ్‌ని చూస్తాడు. తల్లి ఫొటో దండ తీసి పట్టుకొని లోపలికి వస్తాడు. గౌతమ్ వెళ్లిపోతుంటే ఆగు అని అరుస్తాడు. 


రామ్: ఎందుకు రా మా అమ్మ ఫొటో విసిరేశావ్.
గౌతమ్: చచ్చిన వాళ్లు ఫొటో ఇంట్లో ఎందుకు బ్రో ఏదో శవాన్ని చూసినట్లు ఉంది. రామ్ గౌతమ్‌ని కొడతాడు. ఇద్దరూ కొట్టుకుంటే అందరూ అక్కడికి వస్తారు. మహాలక్ష్మీ ఇద్దరిని ఆపుతుంది.
జనార్థన్: ఏం జరిగింది ఎందుకు గొడవ పడుతున్నారు.
గౌతమ్: రామ్ నన్నుకొడుకుతున్నాడు బాబాయ్.
రామ్: వీడు మా అమ్మ ఫొటోని బయటకు విసిరేశాడు. మా అమ్మని శవం అని కూడా అన్నాడు.
గౌతమ్: చనిపోయిన వాళ్లు శవం కాక దేవుళ్లా. శవాల ఫొటోలు ఇంట్లో పెట్టుకోవడం ఏంటి అందుకే విసిరేశాను. చనిపోయిన వాళ్ల ఫొటోలు చూస్తే నాకు ఏదోలా ఉంటుంది.
మహాలక్ష్మీ: నోర్ముయ్ అని కొడుతుంది. సుమతి అంటే శవం కాదురా ఈ ఇంటి దేవత ఇలవేల్పు అలాంటి దేవతని అన్ని మాటలు అంటావా. రామ్‌కి సారీ చెప్పు. చెప్తావా లేదా.
గౌతమ్: సారీ.
రామ్: ఇంకోసారి ఇలా చేశావంటే క్షమించను చంపేస్తాను.  
చలపతి: అయినా చనిపోయిన వాళ్లు చూస్తే నీకు భయం ఎందుకురా. నువ్వు తప్పు చేస్తే వాళ్లు నీ మీద పగ తీర్చుకుంటారు. 


ఈ గొడవ ఇంతటితో వదిలేయండి అని మహాలక్ష్మీ సుమతి ఫొటో పెట్టి దీపం వెలిగిస్తుంది. అందరూ వెళ్లిపోతారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండు లేదంటే తోలు వలిచేస్తారని గౌతమ్‌ని చలపతి బెదిరిస్తాడు. అందరూ నాకు వార్నింగ్ ఇస్తారేంటి అని గౌతమ్ తల్లిని తిడతాడు. సుమతి ప్రాణాలతో లేకపోయినా దాని ఫొటోకి కూడా పవర్ ఉంటుంది అంటుంది మహాలక్ష్మీ. దాంతో ఈ ఇంట్లో నీ తప్ప అందరికీ పవర్ అందని అంటాడు. గౌతమ్ సుమతి ఫొటో చూస్తూ మా అమ్మకి తప్ప ఈ ఇంట్లో అందరికీ త్వరలో జాతర చేస్తానని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్‌ టెన్షన్!