Just In





Nikhil Maliyakkal - Chinni Serial: 'చిన్ని' సీరియల్‌లో కావ్యతో పాటు నిఖిల్ కూడా... మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్
Chinni Serial Today Episode: స్టార్ మా సీరియల్ 'చిన్ని'లో కావ్య శ్రీ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అందులోకి నిఖిల్ మలియక్కల్ కూడా జాయిన్ అయ్యారు.

బుల్లితెరపై సూపర్ హిట్ జోడీలలో బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ మలియక్కల్ (Nikhil Maliyakkal), అందమైన నటి కావ్య శ్రీ (Kavya Shree) జోడి ఒకటి. ఈ మాజీ లవ్ బర్డ్స్ మళ్ళీ ఒక్క గూటికి చేరారు. 'చిన్ని' సీరియల్ చేస్తున్నారు.
'చిన్ని'లో నిఖిల్ మలియక్కల్ క్యారెక్టర్ ఎంట్రీ!
Nikhil Maliyakkal joins Chinni Serial Cast: 'చిన్ని' సీరియల్ ఇప్పటి వరకు 216 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ రోజు (మార్చి 8, శనివారం) 216 ఎపిసోడ్ టెలికాస్ట్. ఎపిసోడ్ ఎండింగ్ చూస్తే నిఖిల్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యింది.
'చిన్ని'లో కావ్య శ్రీ ఒక స్కూల్ టీచర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో ఆవిడ పిల్లలతో కలిసి ఆడుతుంటే నిఖిల్ కారులోంచి దిగాడు. బాల్ పట్టుకున్నాడు. మరి, వాళ్ళిద్దరి క్యారెక్టర్లు ఎలా ఉంటాయి? వాళ్ళిద్దరితో కలిసి దర్శక రచయితలు కలిసి ఆడే ఆట ఎలా ఉంటుంది? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.
బ్రేకప్ తర్వాత నిఖిల్, కావ్య కలిసి...
నిఖిల్, కావ్య శ్రీ కలసి ఇంతకుముందు సీరియల్స్ చేశారు. వాళ్ళిద్దరూ కలిసి చేసిన సీరియల్స్ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. వాళ్ళిద్దరూ ప్రేమలో ఉండడం కూడా ఆ సీరియళ్లకు కలసి వచ్చింది. అయితే, ఇప్పుడు 'చిన్ని' సీరియల్ స్పెషాలిటీ ఏమిటంటే... బ్రేకప్ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న తొలి సీరియల్ కావడం.
'బిగ్ బాస్' సీజన్ 8 నుంచి విజేతగా బయటకు వచ్చిన తర్వాత 'స్టార్ మా'లో ప్రసారం అయ్యే కొన్ని కార్యక్రమాలలో నిఖిల్ పార్టిసిపేట్ చేశాడు. అందులో కావ్య కూడా పాల్గొంది. మాజీ ప్రేమికులు మళ్లీ కలిసే అవకాశాలు తక్కువ అని ఆ కార్యక్రమాలలో ప్రవర్తనను బట్టి అర్థమయింది.
కావ్య శ్రీ నిజ జీవితంలో విలన్‌ను చూస్తున్నానని చెప్పడం కూడా అప్పట్లో వైరల్ అయ్యింది. తనకు నిఖిల్ మీద నమ్మకం పోయింది అనే అర్థం వచ్చేలా కావ్య శ్రీ కొన్ని కార్యక్రమాలలో మాట్లాడారు. మాజీ లవ్ బర్డ్స్ మళ్ళీ ఒకే సీరియల్ చేస్తుండడం వల్ల ఏమైనా దగ్గర అవుతారేమో చూడాలి.
డబుల్ రోల్ చేస్తున్న కావ్య... తన ఐటెంటిటీ దాచి!
'చిన్ని' సీరియల్ చూస్తే కావ్య శ్రీ క్యారెక్టర్ ట్విస్టులు చాలా ఉన్నాయి. ఆవిడ డబుల్ రోల్ చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. జైలులో శిక్ష అనుభవించిన ఖైదీగా ఒక తల్లిగా ఆవిడను తొలుత చూపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ఐడెంటిటీ దాచి కొత్త మనిషిగా కావ్య కనిపించారు. ఇప్పుడు నిఖిల్ ఎంట్రీ తర్వాత ఏమవుతుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. తెలుగు బుల్లితెరకు 'గోరింటాకు' సీరియల్ ద్వారా పరిచయమైన కావ్య శ్రీ ఆ తర్వాత 'అమ్మకు తెలియని కోయిలమ్మ', 'గువ్వా గోరింక' వంటి సీరియల్స్ చేశారు. ఇప్పుడు 'చిన్ని' చేస్తున్నారు.
Also Read: కయాదు లోహర్ మాలీవుడ్ రొమాంటిక్ కామెడీ... రెండు ఓటీటీల్లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్