Ram Pothineni and Bhagyashri Borse Movie Title: ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నవీన్ యెర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోన్న ఆ సినిమాకు క్రేజీ టైటిల్ ఖరారు చేశారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది.
ఆంధ్ర కింగ్ తాలూకా... రామ్ పోతినేని!రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమాకు 'ఆంధ్ర కింగ్ తాలూకా' (Andhra King Taluka) టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. అందుకని, వర్కింగ్ టైటిల్ RAPO22 అని ఫిక్స్ చేశారు. మరి, అధికారికంగా ఈ సినిమా టైటిల్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.
ఇంతకీ ఆంధ్ర కింగ్ ఎవరు? జనసేనాని?Andhra King Taluka: Does it resemble Pawan Kalyan's Pithapuram MLA Gari Taluka tag?: తాలూకా... తెలుగు ప్రజలకు, ముఖ్యంగా ఏపీలో జనాలకు ఈ పదం వింటే గుర్తొచ్చే వ్యక్తి జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎన్నికలలో ఆయన పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించడంతో పాటు పిఠాపురం నియోజకవర్గ నుంచి పవన్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. అప్పటి నుంచి 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అనేది బాగా వైరల్ అయింది.
ఎన్నికల్లో ఘన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. అప్పుడు కొంత మంది 'ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా' అని వైరల్ చేశారు. ఎన్నికల తర్వాత 'తాలూకా' అనేది బాగా జనం నోళ్లలో నానిందంటే కారణం పవన్. ఇప్పుడు అది గుర్తుకు వచ్చేలా 'ఆంధ్ర కింగ్ తాలూకా' అని రామ్ సినిమాకు టైటిల్ ఖరారు చేశారు. మరి, సినిమాలో ఆంధ్ర కింగ్ ఎవరు? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో 'ఆంధ్ర కింగ్ తాలూకా' రూపొందుతోందని సమాచారం.
రాజమండ్రిలో చిత్రీకరణ చేసిన రామ్!ఇటీవల రాజమండ్రిలో 'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్రీకరణ మొదలు అయ్యింది. హీరో హీరోయిన్లు రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే పాల్గొనగా దర్శకుడు మహేష్ బాబు పి కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. తన పాత్రకు సంబంధించిన రాజమండ్రి షెడ్యూల్ చిత్రీకరణ ముగించుకుని భాగ్యశ్రీ హైదరాబాద్ వచ్చారు. రామ్ ఇంకా అక్కడ షూటింగ్ చేస్తున్నారు.
Also Read: విమెన్స్ డే స్పెషల్... మెగా మదర్ అంజనా దేవికి ఇష్టమైన సంతానం ఎవరో తెలుసా? చిరంజీవి ఏం చెప్పారంటే?
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో పాటు హీరో ఫస్ట్ లుక్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాలో ఒక పాటను హీరో రామ్ స్వయంగా రాయడం విశేషం. ఆ ప్రేమ గీతం ఎలా ఉంటుందనే ఆసక్తి ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు అందరిలో నెలకొంది. అలాగే ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ సినిమాలో కొన్ని పాటలను రాశారు. త్వరలో టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు సినిమా విడుదల తేదీ గురించి ఏమైనా వెల్లడిస్తారేమో చూడాలి.