మార్చి 09 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు శాంతియుతంగా గడపాలని కోరుకుంటారు. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. చాలాకాలం తర్వాత కొందరు బంధువులను కలుస్తారు.  వైవాహిక జీవితానికి తగినంత సమయం ఇవ్వాలి. జీవిత భాగస్వామి కారణంగా మీ ధైర్యం పెరుగుతుంది.


వృషభ రాశి


ప్రతికూల ఆలోచనతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి.  పొరుగువారి కారణంగా అసంతృప్తిగా ఉంటారు. వ్యాపారంలో కొన్ని సమస్యలు బయటపడతాయి. మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి టైమ్ కలిసొస్తుంది.


మిథున రాశి


ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. చుట్టూ ఉన్నవారు మీతో సంతోషంగా ఉంటారు. మీరున్న రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఈరోజు మీరు శుభవార్త వింటారు. విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.


Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!


కర్కాటక రాశి


ఉద్యోగం మారేందుకు ప్రయత్నిస్తారు. ఓ గుడ్ న్యూస్ వినాలనే ఆలోచన మనసులో ఉంటుంది. స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. నూతన వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. చెవి, గొంతుకి సంబంధించిన సమస్యలుంటాయి 


సింహ రాశి


ఈ రోజు వ్యాపారంలో మంచి ఫలితాలు పొందే అవకాశం తక్కువ. మీరు ఒకేసారి చాలా పనులు చేయాల్సి ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి.  బడ్జెట్‌ను జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల ప్రవర్తన గురించి ఆందోళన చెందుతారు. 
 
కన్యా రాశి


ఈ రోజు కొత్త వ్యక్తులను కలుస్తారు. నూతన విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. మీరు మీ తప్పులను గుర్తించగలుగుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకోని అవమానాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు.


Also Read: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రానికి ఎన్ని సున్నాలు ఉన్నాయి.. ఉంటే ఏమవుతుంది!


తులా రాశి


ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ప్రయాణంలో సమస్యలు ఎదురవుతాయి. నూతన  ఉద్యోగ ఆఫర్ పొందడం ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి...మీ మాటలు తప్పుడు అర్థాన్నిచ్చేలా ఉంటాయి. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు.


వృశ్చిక రాశి


ఈ రోజు మీరు ఏదో విషయంలో బాధపడతారు. వ్యాపారంలో భాగస్వాములు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు. మీ ఆలోచనలను ఇతరులపై రుద్దొద్దు. బట్టలు ఆభరణాల కోసం ఖర్చు చేస్తారు.


ధనస్సు రాశి


ఈ రోజు మీరు రహస్య శత్రువులు చెక్ పెడతారు. కుటుంబానికి మంచి సమయం కేటాయిస్తారు. చేయాలి అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తిచేస్తారు. ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని గౌరవిస్తారు.


Also Read: ఉగాది 2025 విశ్వావసు నామసంవత్సరంలో మీ రాశి ప్రకారం ఆదాయం - వ్యయం తెలుసుకోండి!


మకర రాశి


ఈ రోజు మీరు ఏదో విషయంలో బాధపడతారు. మీ మనసులో ఏదో అలజడి ఉంటుంది. అవివాహితులకు ఇంకొన్నాళ్లు ఎదురుచూడక తప్పదు. ఇతరుల పనులపై కాదు మీ వ్యవహారాలపై దృష్టి సారించండి. కళ్లకు సంబంధించిన సమస్య ఉండొచ్చు. 


కుంభ రాశి


ఈ రోజు మీరు చాలా మందిని ప్రభావితం చేస్తారు. నూతన ఆస్తిలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు చాలా పవిత్రమైనది. కుటుంబ జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అనుకోని అతిథులు వస్తారు. ఉద్యోగాలలో పురోగతి అవకాశాలు ఉన్నాయి.


మీన రాశి


ఈ రోజు మీరు కొత్త పనులు చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం మధురంగా ​​ఉంటుంది. ఉద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ పొందే సమయం ఇది.


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


మీ నక్షత్రం ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...