Saptahik Rashifal 10 March to 16 March 2025: ఈ వారం సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశులకు సంబంధించి శుభ, అశుభ ఫలితాలు ఇక్కడ  చూసుకోండి...


సింహ రాశి (Leo  Weekly Horoscope)


ఈ వారం మీరు మీ ప్రతిభ , సామర్థ్యాన్ని సమర్థవంతంగా ప్రదర్శించగలుగుతారు. పొదుపు గురించి ఆలోచిస్తారు..ఇప్పుడు తీసుకునే నిర్ణయం కారణంగా భవిష్యత్ లో ప్రయోజనం పొందుతారు. ఉన్నత అధికారులు మీపై సంతోషంగా ఉంటారు. క్రీడలతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాన్ని పొందుతారు. పిల్లల పట్ల మీ బాధ్యతలు పెరుగుతాయి. మీరు ప్రసిద్ధ విద్యా సంస్థలలో ప్రవేశం పొందవచ్చు. కొత్తగా చేపట్టబోయే పని గురించి మనసులో ఉత్సాహం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. కండరాలు, మోకాలి సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యుల్లో  ఒకరి ప్రవర్తన కారణంగా నిరాశ చెందుతారు.మీ కిందస్థాయి ఉద్యోగులకు మీపై అసంతృప్తి ఉంటుంది. ఇంట్లో చిన్న విషయాల వల్ల గొడవ జరుగుతుంది.


Also Read: ఈ వారం ఈ రాశులవారి ఫ్యూచర్ కీలక మలుపు తిరుగుతుంది.. వ్యక్తిగత జీవితంలో అంతా సంతోషమే!


కన్యా రాశి  (Virgo  Weekly Horoscope) 


ఈ వారం మొత్తం మీకు చాలా శుభంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. స్నేహితుడి మధ్యవర్తిత్వం ద్వారా పాత వివాదాలు పరిష్కారం అవుతాయి. డబ్బు సంబంధిత లావాదేవీల నుంచి మీకు చాలా మంచి ప్రయోజనాలు లభిస్తాయి.  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  అనుభవజ్ఞులైన వ్యక్తుల మార్గదర్శకత్వం పొందుతారు. భాగస్వామ్య సంబంధిత కార్యాచరణ ప్రణాళికలు వేస్తారు. మీరు ప్రేమ వ్యవహారాలను ఆనందిస్తారు. మతపరమైన ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. పాత స్నేహితులకు ఆర్థిక సహాయం అందిస్తారు. మీ ప్రవర్తన కొన్ని సందర్భాల్లో విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రైవేట్ సంస్థలలో పనిచేసే వ్యక్తుల మనస్సులో అభద్రత భావన తలెత్తుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి మీరు చాలా ఆందోళన చెందుతారు. మీరు ప్రతికూల పరిస్థితిలో కూడా కోపంగా ఉండకుండా ఉండాలి.  


Also Read: Ugadi 2025 Aadayam Vyayam : ఉగాది 2025 విశ్వావసు నామసంవత్సరంలో మీ రాశి ప్రకారం ఆదాయం - వ్యయం తెలుసుకోండి!
 
తులా రాశి (Libra  Weekly Horoscope) 


ఈ వారం తుల రాశివారికి శుభప్రదమైనది. వారం ప్రారంభం నుంచి మీ ఆలోచనావిధానం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రణాళికాబద్ధమైన పద్ధతిలో పనిచేయడం ద్వారా ఉద్యోగులు ప్రత్యేక ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి వారం ఆరంభంలో బావుంటుంది. ఎప్పటి నుంచో అందాల్సిన డబ్బు మీరు ఊహించకుండా చేతికందుతుంది.  విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది.  అకస్మాత్తుగా వారం చివరి భాగంలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రయాణం ఆహ్లాదకరంగా  ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ సమర్థవంతమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.


Also Read: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రానికి ఎన్ని సున్నాలు ఉన్నాయి.. ఉంటే ఏమవుతుంది!


వృశ్చిక రాశి (Scorpio   Weekly Horoscope) 


ఈ వారం మొత్తం మీకు అనుకూల ఫలితాలే ఉంటాయి. మీరు తీవ్రమైన సమస్యల గురించి కొంచెం ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తారు. మీరున్న రంగంలో పని విషయంలో గౌరవం పొందుతారు.  వ్యాపారంలో మార్పులు చేయడానికి ప్రయత్నించండి.  చిన్న వ్యాపారవేత్తల ఆర్థిక పరిస్థితి బావుంటుంది. సృజనాత్మకంగా ఏదైనా చేయాలనే కోరిక ఉంటుంది. వారం ప్రారంభ భాగం మీకు అంతా మంచే జరుగుతుంది.  అకస్మాత్తుగా, కొన్ని శుభవార్తలు వినడం సంతోషంగా ఉంటుంది. ఇతరుల నుంచి ఏమీ ఆశించవద్దు.  చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు.  వారం ప్రారంభంలో పరధ్యానంలో ఉంటారు. మీ చుట్టూ ఉండే అవకాశవాద వ్యక్తులను ఈ వారం గుర్తిస్తారు. కోర్టుకు సంబంధించిన కేసులలో నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు.  


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!


మీ నక్షత్రం ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...