Dogs attack on a girl: ఆ అమ్మాయి తన మానాన తాను రోడ్డుపై నడుచుకుంటూ పోతోంది. ఫోన్లో మాట్లాడుకుంటోంది. రోడ్డుపక్కన ఎవరికీ అడ్డం లేకుండా నడుచుకుంటూ పోతోంది. అయితే హఠాత్తుగా ఎనిమిది కుక్కలు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయిని రౌండప్ చేశాయి. అంతే కాదు ఆ ఎనిమిది ఒకే సారి ఆ అమ్మాయి మీద పడి కరవడం ప్రారంభించాయి. లక్కీగా ఓ మహిళ స్కూటీ మీద వెళ్తూ భయపడకుండా కిందకు దిగి ఆ కుక్కలను తరమడంతో పాటు ఇతరులు కూడా రావడంతో ఆ కుక్కలు పారిపోయాయి. ఆ అమ్మాయి ఒంటి నిండా కుక్క గాట్లు మాత్రం తప్పలేదు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ గా మారింది.
రాజస్తాన్ లోని అల్వార్ లో ఈ ఘటన జరిగింది. ఆ కుక్కలు ఆ అమ్మాయి మీదనే ఎందుకు పగబట్టాయన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఆ అమ్మాయి ఫోన్లు మాట్లాడుకుంటూ.. వచ్చేటప్పుడు ఏదోఓ కుక్కను కసురుకుని ఉంటుందని.. ఆ కుక్క తన గ్యాంగ్ ను తీసుకుని ఆ అమ్మాయిపైకి దాడికి వచ్చిందని అనుమానిస్తున్నారు.
ఆ యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాళ్లు, చేతులతోపాటు ముఖం మీద కూడా కుక్కలు కరిచాయి. తన మానాన తాను నడుచుకుంటూ వస్తున్న సమయంలో దాడి చేశాయని.. ఎందుకు దాడి చేశాయో కూడా తనకు తెలియని ఆ అమ్మాయి అంటోంది. అల్వార్ లో వీధి కుక్కల సమస్యకు ఇతి ప్రతిరూపంలో ఉందని.. ఎందుకు చర్యలు తీసుకోడవం లేదన్నప్రశ్నలు సోషల్మీడిలో వేస్తున్నారు.