Ennallo Vechina Hrudayam Serial Today Episode త్రిపుర పెళ్లి ఆగిపోతుంది. రమాదేవి అందరి దగ్గరకు వచ్చి ఇక మీ అమ్మ రావడం కలే. మామయ్య మీ పెద్దకోడలు ఇక రాదు. కుదిరితే నీళ్లు పడేసి ఖర్మ కాండలు చేసుకోండి అంటుంది. పిన్నీ ఏంటి ఆ మాటలు నోరు అదుపులో పెట్టుకోండి అని గాయత్రీ అంటుంది. మీ వల్లే అమ్మ ఇరుక్కుపోయిందని చిన్న దొంగతనం చేసినందుకే వాడికి అరెస్ట్ చేయిస్తారా. వాడికి ఉన్న ఆస్తిపాస్తులకు ఆ రత్నమాల ఊరుకుంటుందా. మీ అమ్మ ఇక ఇక్కడికి రాదు అని అంటుంది.


గాయత్రీ పిన్నితో వాళ్లకి డబ్బు ఇచ్చే ఉద్దేశం ఉంటే ముందే ఇచ్చేవారు కదా ఇలా పెళ్లి నాటకం ఆడడు కదా అంటుంది. ఇప్పుడు డబ్బు  కోసం ఏం చేస్తారు అని అంటుంది రమాదేవి. ఎవరు మీకు అంత డబ్బు ఇస్తారు అని అంటే దానికి గాయత్రీ మాకు ఈ ఇళ్లు ఉంది ఈ ఇళ్లు అమ్మి అయినా సరే అమ్మని తీసుకొస్తా అని అంటుంది. రమాదేవి షాక్ అయిపోతుంది. త్రిపుర కూడా చెల్లిదే సరైన ఆలోచననే అంటుంది. పెద్దాయన కూడా ఓకే అంటారు. రమాదేవి ఒప్పుకోను అని మామ మీద అరుస్తారు. దాంతో పెద్దాయన ఏంటి మాట్లాడుతున్నావ్ ఏం మాట్లాడుతున్నావ్ నోర్ముయ్ ఇది తన తండ్రి ఇళ్లు అది ఏమైనా చేసుకుంటుంది అని అంటారు. గాయత్రీ వాళ్లతో మీకు నచ్చితే ఉండండి లేదంటే మీ దారి మీరు చూసుకోండి అని అంటుంది. ఇక మేం మీతోనే ఉంటామని రమాదేవి అంటుంది. గాయత్రీ ఇళ్లు బేరం పెట్టిస్తానని అంటుంది.


బాల చిన్నపిల్లాడిలా ఆడుకుంటూ ఉంటే వాసు కొడుకు అనంత్‌తో బాక్స్‌లో పాము పెట్టింది ఎవరో కనుక్కోవాలి అని ఆ త్రిపుర కూడా ఎవరో తెలుసుకోవాలి అనుకుంటారు. ఇక వాసుకి గురువుగారు చెప్పినట్లు 24 గంటల్లో బాల మామూలు మనిషి అయిపోతే మనం ఇక్కడికి వచ్చిన పని పూర్తి అయిపోయినట్లే అంటుంది. అది జరగదు అని నాగభూషణం అంటాడు. ఇంతలో బాలకి ఉరుములు మెరుపులు సౌండ్స్ వచ్చి తల పట్టుకొని మెలికలు తిరుగుతాడు. అందరూ వచ్చి ఏమైందని అడిగితే ఏయ్ స్టాపిట్ అని అరుస్తాడు. అందరినీ చూసి మనం ఏంటి ఇక్కడ ఉన్నాం అని ఎప్పటిలా అనంత్, ఫణి, డాడీ అని పనులు చెప్తూ ఇంగ్లీష్‌లో మాట్లాడుతాడు. అందరూ వింతగా చూస్తారు. ఇక వాసుకి, బామ్మ బాలని పట్టుకొని ఏడుస్తారు. ఏమైంది ఇలా వింతగా పట్టుకొని బాధ పడుతున్నారు ఏమైంది అని అడుగుతాడు. బాబాయ్ అని బాల ఏదో చెప్పబోయే టైంకి వాసుకి, నాగభూషణం చెమటలు పట్టేస్తారు. ఎందుకు చెమటలు పడుతున్నారు అని అడుగుతాడు.


బాల కోసం తాము కలిపిన కషాయం తీసుకురమ్మని వాసుకి భర్తకి చెప్తుంది. ఫణి కూడా అన్నని చూస్తూ ఉండిపోతాడు. కషాయం నాగభూషణం తీసుకొస్తాడు. నాగభూషణం ఇచ్చేటైంకి బాల మళ్లీ చిన్నపిల్లాడిలా అయిపోయి కషాయం తాగడానికి రెడీ అవుతాడు. తర్వాత మళ్లీ పాత మనిషిలా అయిపోయి ఈ కషాయం నాకు ఇచ్చారేంటి అని కోపంగా దాన్ని విసిరి పడేస్తాడు. మళ్లీ తల పట్టుకొని చిన్న పిల్లాడిలా అయిపోతాడు. ఓరినీ ఫెర్ఫామెన్స్ అని నాగభూషణం నోరెళ్లబెడతాడు. బామ్మ వాళ్లు గదికి తీసుకొస్తారు. త్రిపుర వాళ్లంతా రిజిస్టర్ ఆఫీస్‌కి  వస్తారు. ఇళ్లు అమ్ముతున్నందుకు రమాదేవి ఇళ్లు రెంట్‌కే సరిపోతుంది. ఇక నుంచి ఒక పూట తిని మరోపూట పస్తులుండాలని మాట్లాడుకుంటారు. ఇక అందరూ లోపలికి వెళ్తారు. త్రిపుర, గాయత్రీలు ఇంటిని అమ్ముతున్నట్లు సంతకం పెట్టి డబ్బు తీసుకుంటారు.


బాల మారుతాడని నమ్మకం ఉందని వాసుకి అంటే మారడు అని నాకు నమ్మకం ఉందని నాగ భూషణం అంటాడు. ఇక బాల టిప్ టాప్‌గా రెడీ అయి వస్తే నాగభూషణం, వాసుకి నోరెళ్లబెడతారు. మిగతా అందరూ హ్యాపీగా ఫీలవుతారు. బాల కిందకి వచ్చి పాండురంగా రావు గారి ఫైల్ అడుగుతాడు. లాస్ట్ సైన్ చేసింది అదే అని అది క్లియర్ చేసి డబ్బు ఇచ్చావా అని అంటే అనంత్ లేదని చెప్తే బాల కోప్పడతాడు. ఆ ఫైల్ తీసుకురమ్మని చెప్తాడు. అనంత్‌తో పాటు బాల కూడా వెళ్తాడు. బామ్మ, వాసుకిలు సంతోషంలో దేవుడికి దండం పెడతారు. మనకి ఇక డబిడదిబిని ఫణి తల్లిదండ్రులు అనుకుంటారు. మరోవైపు త్రిపుర వాళ్లు ఇంటికి వచ్చేసరికి అక్కడ రత్నమాల కూర్చొంటుంది. గాయత్రీ దగ్గర బ్యాగ్ తీసుకొంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్‌ టెన్షన్!