వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? ఇదేం పిచ్చి ప్రశ్న. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. ఎన్నికల కమిషన్ చెప్పినట్లుగా ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహిస్తారు .. అని మనందరికి తెలిసిన విషయం. కానీ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు మాత్రం అంతకు మించి తెలుసు. ఎన్నికలను ఎన్నిహించేది ఎన్నికల సంఘమే అయినా... ఎన్నికల విధులు నిర్వహించేది మాత్రం వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులట. మంత్రాలయం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ఈ విషయాన్ని ఏ మాత్రం దాచుకోకుండా చెప్పారు. 


ఏపీలో ఏదో జరిగిపోతోందన్నట్లుగా విమర్శలు - చంద్రబాబు ఉన్మాదిలా మారారన్న సజ్జల


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల సన్మాన కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సన్మానాలను ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నారు. వాలంటీర్లను సన్మానించిన బాలనాగిరెడ్డి అసలు విషయాన్ని మెల్లగా బయటపెట్టారు.  సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలకు లేని పవర్ జగన్ వాలంటీర్లకు ఇచ్చారని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తెలిపారు. ఇప్పుడు ప్రజలెవరూ సమస్యల పరిష్కారం కోసం.. తమ వద్దకు రావడం లేదని తెలిపారు. అందరూ వాలంటీర్ల దగ్గరకే వెళ్తున్నారన్నారు.  రాబోయే ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగులనే బూత్ అధికారులుగా నియమిస్తారని తెలిపారు. వారి చేతుల మీదుగానే ఎన్నికలు జరుగుతాయన్నారు. 


ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఇంకా ఎంత కాలం ? ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు !


స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్లు జోక్యం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ ఉండటంతో .. ఆ యాభై ఇళ్ల సమాచారం వాలంటీర్ కు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్‌లో ఉంటుంది. వారందరూ ప్రభుత్వ పథకాలు అందిన వారిని బెదిరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఓ దశలో వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని.. వారి వద్ద ఉన్న ఫోన్లన్నింటినీ స్వాధీనం చేయాలని ఎస్‌ఈసీ ఆదేశించారు. తర్వాత తిరుపతి, బద్వేలు ఉపఎన్నికల్లోనూ ఈ వివాదం వచ్చింది. 


ఏపీలో దొంగల్లా పోలీసులు - వైఎస్ఆర్‌సీపీ నేతలు తెమ్మంటే మహిళల్నీ తీసుకెళ్లిపోతారా? : చంద్రబాబు


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వాలంటీర్లకు ఎన్నికల బాధ్యతలు ఉండకూడదని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అదే సమయంలో వాలంటీర్లతో పాటు గ్రామ, వార్డు సచివలాయ ఉద్యోగులు కూడా బూత్ అధికారులుగా ఉంటాని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చెప్పడం వివాదామయ్యే అవకాశం ఉంది. ఎన్నికల అధికారులుగా ఎవర్ని నియమించాలన్నదానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవస్థ అంతా ఈసీ చేతుల్లోకి వెళ్లిపోతుంది. అయినప్పటికీ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు పోలింగ్ బూత్‌లలో వాలంటీర్లే ఉంటారన్న నమ్మకంతో ఉన్నారు.