ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం బలవంతంగా కారు తీసుకెళ్లిన ఘటనపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు ( Chandrababu ) మండిపడ్డారు. ఏపీలో పోలీసులు ( AP Police ) దొంగల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతికి వెళ్తున్న భక్తులు టీ తాగుదామని ఆగితే పోలీస్ కానిస్టేబుల్ వచ్చి కారును తీసుకెళ్లిపోయారన్నారు. తర్వాత ఆర్టీఏ అధికారులొచ్చి సీఎం కోసం కారు తీసుకెళ్లామని తీరిగ్గా చెప్పారని ఇదేం పద్దతని ప్రశఅనించారు. ఎవరైనా అమ్మాయి కావాలని కోరుకుంటే ఇళ్లల్లో వచ్చి మహిళలను ఎత్తుకుపోతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులకు.. మహిళల శీలాలకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congres Party ) రాజకీయాల్లో ఉండదగ్గ పార్టీ కాదన్నారు. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా కోపం వస్తోందని సభ్యత అడ్డం వచ్చి సంయమనం పాటిస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
సీఎం కాన్వాయ్‌కు కారు లాక్కున్న ఘటనలో దిద్దుబాటు చర్యలు - ఇద్దరిపై సస్పెన్షన్ వేటు
ఒంగోలులో సీఎం పర్యటనకు కాన్వాయ్‌లో కార్లు అవసరం అని తిరుపతి వెళ్తున్న వినుకొండ భక్తులకు సంబంధించిన కారును ఓ కానిస్టేబుల్ తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన ఏపీలో సంచలనం సృష్టించింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ ఘటనపై సీఎంవో కూడా ( CMO ) స్పందించింది. బలవంతంగా కారు ఎత్తుకెళ్లిపోయిన హోంగార్డు పి.తిరుపతిరెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎ.సంధ్యపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ కారు యజమాని శ్రీనివాస్ గురించి ఏపీ సీఎం కార్యాలయం ఆరా తీసింది. కారు స్వాధీనం ఘటనపై పూర్తి వివరాలు సేకరించింది. ఆ కారును తీసుకెళ్లాలని ఫోనులో శ్రీనివాస్‌కు పోలీసులు చెప్పారు.
ఏపీలో మరో ఓదార్పు యాత్ర - జోరుగా జనాల్లోకి, ఫుల్ ఖుషీలో పార్టీ క్యాడర్
ఈ ఘటనపై విపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డాయి. సీఎం కాన్వాయ్ ( CM Convoy ) కూడా పెట్టుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే సీఎం సభలు, ఇతర కార్యక్రమాలు జరిగితే ఆర్టీఏ అధికారులు వాహనాలు సమీకరించడం సహజమేనని పోలీసులు చెబుతున్నారు. అయితే డ్రైవర్ల అంగీకారంతోనే ఇలా సమీకరిస్తారని.. ఇలా ప్రయాణం మధ్యలో ఉన్న వాహనాన్ని తీసుకెళ్లడంతో వివాదాస్పదం అయిందన్నారు. ప్రజల్లోనూ ఈ ఘటన విస్తృతంగా చర్చనీయాంశమయింది.