రెండేళ్లకుపైగా సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (  ABV ) ఇంకా ఎంత కాలం పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్‌లో ఉంచుతారని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిగింది.   రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ చేయకూడదన్న నిబంధనలను సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి గుర్తు చేసింది. అయితే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కొనసాగింపు కోసం కేంద్ర ప్రభుత్వం  ( Central Governament ) నుంచి తగిన ఆదేశాల కోసం చూస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.  రెండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం ఏమిటని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. శుక్రవారంలోగా  అన్ని వివరాలతో రావాలని పేర్కొంది సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది.  రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీపై జోక్యానికి ఆధారాలు కనిపించట్లేదని అభిప్రాయం పడింది. 


ఏపీలో మ‌రో ఓదార్పు యాత్ర - జోరుగా జనాల్లోకి, ఫుల్ ఖుషీలో పార్టీ క్యాడర్


శుక్రవారం విచారణ తర్వాత  వాయిదా వేయడం కుదరదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకోవాల్సిందేనని ఆదేశించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు .. ప్రభుత్వం మారిన తర్వాత గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆరు నెలల పాటు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకపోగా ఆ తర్వాత వివిదధ రకాల ఆరోపణలతో కేసులు నమోదు చేసి సస్పెన్షన్  చేశారు. ఆ సస్పెన్షన్ కాలం రెండేళ్లు దాటిపోయింది. ఆ కేసుల చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడినందుకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దానికి ఏబీ వెంకటేశ్వరరావు సమాదానం ఇచ్చారు. ఏం చర్యలు తీసుకుంటారో ఇంకా స్పష్టత రాలేదు. 


సీఎం జగన్ కాన్వాయ్ కోసం కారు లాక్కెళ్లిన కానిస్టేబుల్- దుమారం రేపుతున్న సంఘటన


ఏబీ వెంకటేశ్వరరావపై నమోదు చేసిన కేసులకు ..  ప్రభుత్వ సీపీఆర్వో చేసిన ప్రచారానికి సంబందం లేదని తనపై దేశద్రోహం ఆరోపణలు చేశారని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారందరిపై పరువు నష్టం దావా వేస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. అయితే ఆయనకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. తన సస్పెన్షన్ గడువు ముగిసిందని.. తనను విధుల్లోకి తీసుకుని పూర్తి జీతం ఇవ్వాలని ఆయన సీఎస్‌కు లేఖ రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.