Ramoji Rao Born House in Pedaparupudi: పామర్రు: ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారని ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే రామోజీరావు మళ్లీ పుట్టారు అంటున్నారు ఆ గ్రామానికి చెందిన వారు. అది ఎలాగంటారా.. కృష్ణా జిల్లా పామర్రులోని ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో (Pedaparupudi) 1936లో రామోజీరావు ఓ చిన్న ఇంట్లో జన్మించారు. ఆ ఇంటికి 100 ఏళ్ల చరిత్ర ఉన్నా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. శనివారం రామోజీరావు అస్తమించగా.. అదే రోజు పెదపారుపూడిలో రామోజీరావు పుట్టిన ఇంట్లో ఓ చిన్నారి జన్మించాడు. 


పెద్దాయన కన్నుమూసిన రోజే అదే ఇంట్లో మరో జననం 
ఎనిమిదిన్నర దశాబ్దాల కిందట రామోజీరావు స్వగ్రామంతో ఏ ఇంట్లో జన్మించారో.. తాజాగా ఆయన కన్నుమూసిన రోజే అదే ఇంట్లో ఓ చిన్నారి జన్మించాడు. దాంతో మహానుభావుడు రామోజీరావు గారే తమ ఇంట్లో పుట్టాడు అన్నట్లు భావిస్తున్నట్లు ఆ ఇంటి మహిళ చెప్పారు. రామోజీరావు పాత ఇంట్లో ఇప్పుడు నివాసం ఉంటున్న నిమ్మగడ్డ వెంకట సుజాత ఏబీపీ దేశంతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. రామోజీరావు విక్రయించగా అర్జున రావ్ ఆ ఇంటిని కొన్నారు. ఆపై అర్జున్ రావు కాలం చేయగా, ఆయన కుమారుడు సుబ్బారావు ఇంటి ఓనర్. ఆయన విజయవాడలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో తాము అద్దెకు ఉంటున్నట్లు వెంకట సుజాత తెలిపారు. వేల కోట్లకు అధిపతిగా మారినా తాను పుట్టిన గడ్డను, సొంత గ్రామాన్ని ఎప్పటికీ మరిచిపోని వ్యక్తిత్వం రామోజీరావు సొంతం. 



రామోజీరావు సొంత గ్రామాన్ని వీడినా.. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. రూ.20 కోట్లకు పైగా సొంత నిధులతో గ్రామానికి మంచి పనులు చేశారని స్థానికులు గుర్తుచేసుకున్నారు. గ్రామంలో హైస్కూల్ కట్టడంతో పాటు రోడ్లు వేయించడం, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంక్‌లను రామోజీరావు నిర్మించారని సుజాత చెప్పుకొచ్చారు. రామోజీరావు చనిపోయారని ఓ వైపు బాధగా మరోవైపు తనకు అదే రోజు రామోజీ పుట్టిన ఇంట్లోనే మనవడు పుట్టాడని.. దాంతో రామోజీరావు గారే పుట్టారని భావిస్తున్నామని చెప్పారు. రామోజీరావు స్వగ్రామానికి చేసిన సేవల్ని పెదపారుపూడి వాసులు గుర్తు చేసుకున్నారు.  
Also Read: Nirmala Sitharaman: 2 రోజుల కిందటే రామోజీరావు ఆరోగ్యంపై నరేంద్ర మోదీ ఆరా! అంతలోనే విషాదం: నిర్మలా సీతారామన్



రామోజీరావు పుట్టిన ఇల్లు చూశారా.. 
రామోజీరావు గురించి ఎంతో తెలిసినా.. ఆయన పుట్టిన ఊరు గురించి తెలిసిన వాళ్ళు తక్కువే. గుడివాడ కు 5 కిమీ దూరం లోని పెదపారుపూడిలో 1936 లో ఆయన జన్మించారు. ఆయన పుట్టిన ఇళ్లు 100 ఏళ్ల చరిత్రతో ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. రామోజీ ఫౌండేషన్ పేరుతో పుట్టిన ఊరుకు ఎంతో సేవ చేసిన ఆయన దాని అభివృద్ధి కోసం కోట్లు ఖర్చు పెట్టారు. దానితో  ఆయన మరణాన్ని పెదపారుపూడి ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.


రామోజీరావు అంత్యక్రియలు 
ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలో (Ramoji Film City) జూన్ 9న (ఆదివారం) రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య అంత్యక్రియలు జరగనున్నాయి. శనివారం నాడు సినీ, రాజకీయ, వ్యాపార, ఇతర రంగాల ప్రముఖులతో పాటు సామాన్యులు రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.


Also Read: రామోజీరావుకు పవన్‌, చిరు నివాళులు- గొప్ప వ్యక్తిని కోల్పోయామంటూ ఆవేదన