Union Budget 2025 - 26 Full Details:
1. కొత్త ఐటీ శ్లాబ్స్ ప్రకారం ఎవరి జీతం ఎంత?
త్త ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉపశమనాన్ని ప్రకటించారు. రూ. 12 లక్షల వరకు (నెలకు సుమారు రూ. 1 లక్ష) ఆదాయం ఉన్న వ్యక్తులను ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. జీతం పొందే పన్ను చెల్లింపుదారులకు, రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా ఈ పరిమితిని రూ. 12.75 లక్షలకు పెంచారు. పూర్తి వివరాలకు..
2. రైతులకు నిర్మలమ్మ గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2025-26లో రైతులకు శుభవార్త చెప్పింది. కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని కేంద్రం పెంచింది. ఇప్పటి వరకు ఇచ్చే 3 లక్షల రూపాయలను ఐదు లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు కేంద్రం తన బడ్జెట్‌లో ప్రకటించింది. భారతదేశ సాంప్రదాయ పత్తి పరిశ్రమను ప్రోత్సహించడంపై మోదీ సర్కార్ ఫోకస్ చేసింది. పత్తి ఉత్పత్తికి 5 సంవత్సరాలలో చేయూత అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3. ఈ వస్తువుల ధరలు పెరుగుతాయ్!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించారు. ఇందులో సామాన్యులకు ఊరటనిచ్చేలా పలు ప్రకటనలు చేశారు. సీతారామన్ మొబైల్ ఫోన్లలో ఉపయోగించే కాంపోనెంట్లపై పన్ను మినహాయింపు ఇచ్చారు. దీంతో స్మార్ట్‌ఫోన్‌ల ధర తగ్గుతుంది. కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు తక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఓపెన్ సేల్స్‌పై బేసిక్ కస్టమ్ డ్యూటీని 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడం వల్ల, LCD మరియు LED TV ధరలు కూడా తగ్గుతాయి. పూర్తి వివరాలకు..
4. అరకు, పాడేరుకు బడ్జెట్‌లో కీలక ప్రకటన
విమాన సర్వీసులను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్(Udan) పథకాన్ని మరింత సవరణలతో తీసుకొస్తున్నట్లు బడ్జెట్ (Budget)ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ తెలిపారు.120 కొత్తప్రదేశాలకు విమాన సర్వీసులు అందించడంతోపాటు 4 కోట్ల మంది కొత్త ప్రయాణికులను చేర్చుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని ఆమె ప్రకటించారు. ఇంకా చదవండి.
5. ఏటికొప్పాక బొమ్మలకు మహర్దశ
ఏటికొప్పాల బొమ్మలకు మహర్దశ రానుంది. కేంద్ర ప్రవేశపెట్టనున్న తోలు పథకం ద్వారా 22 లక్షల మందికి ఉపాధి లభించనుంది. పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి సీతారామన్.. ఏటికొప్పాక బొమ్మల విశిష్టతను చాటారు. భారతదేశాన్ని టాయ్ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. బొమ్మల కోసం జాతీయ ప్రణాళిక రూపకల్పన చేశామన్నారు. 'మేక్ ఇన్ ఇండియా'ను మరింత ప్రోత్సహించేందుకు చిన్న, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ తయారీ మిషన్‌ను ఏర్పాటు చేస్తుందని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇంకా చదవండి.
6. దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంత్సరానికి సంబంధించిన బడ్జెట్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. గిగ్ వర్కర్లకు గుర్తింపునిస్తూ కార్డులను జారీ చేయనున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో తెలిపారు. ఇప్పటికే రైతులకు పీఎం ధన్ ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు. లేటెస్ట్ గా గిగ్ వర్కర్లకు గుర్తింపునిస్తూ కార్డులను జారీ చేయనున్నారు. ఈ-శ్రమ పోర్టల్ కింద నమోదు చేసుకున్న వారికి ఆరోగ్య బీమాను కూడా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు..
7. ఎంఎస్ఈ, స్టార్టప్‌లకు అదిరిపోయే న్యూస్
దేశంలో పెట్టుబడులతో పాటు స్టార్టప్ లకు కేంద్రం ఊతమిచ్చింది. ఈసారి చిన్న తరహా, స్టార్టప్‌లపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపి వారికి బడ్జెట్ లో వరాలు ప్రకటించింది. వారి కోసం ప్రత్యేక ఫండ్ ఇవ్వనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఎంఎస్‌ఈలు, స్టార్టప్‌లు 20 కోట్ల వరకు రుణాలు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పూర్తి వివరాలకు..
8. ప్రతి స్కూల్‌కు ఇంటర్నెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఎనిమిదవ బడ్జెట్ ప్రసంగంలో ఐదు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అదనంగా 6,500 సీట్లు క్రియేట్ చేయబోతున్నట్టు ప్రకటించారు. IIT పాట్నాను విస్తరిస్తున్నట్లు తెలిపారు. "గత 10 సంవత్సరాల్లో 23 IITలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 65,000 నుంచి 1.35 లక్షలకు 100 శాతం పెరిగింది. 2014 తర్వాత ప్రారంభించిన 5 IITల్లో 6,500 మంది విద్యార్థులకు విద్యను సులభతరం చేయడానికి అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాం. " అని సీతారామన్ చెప్పారు. ఇంకా చదవండి.
9. సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్
2025-26 బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు TDS డిడక్షన్‌ను రూ. 50,000 నుంచి రూ. 1,00,000 కు పెంచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంటులో తన 2025 బడ్జెట్ ప్రసంగంలో సీనియర్ సిటిజన్లకు TDS అద్దెపై వార్షిక పరిమితిని 6 లక్షలకు పెంచినట్లు సీతారామన్ తెలిపారు. పూర్తి వివరాలకు..