Budget 2025 Live Updates: దేశంలో పెట్టుబడులతో పాటు స్టార్టప్ లకు కేంద్రం ఊతమిచ్చింది.  ఈసారి చిన్న తరహా, స్టార్టప్‌లపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపి వారికి బడ్జెట్ లో వరాలు ప్రకటించింది. వారి కోసం ప్రత్యేక ఫండ్‌ ఇవ్వనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఎంఎస్‌ఈలు, స్టార్టప్‌లు 20 కోట్ల వరకు రుణాలు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వారికి ప్రత్యేక క్రెడిట్ కార్డులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.

Continues below advertisement


రూ.10 కోట్లకు కేంద్రం రుణాలు 
చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు ఎంఎస్‌ఎంఈ రుణం రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు కేంద్రం రుణాలు ఇస్తామని తెలిపింది. వీటితో పాటు డెయిరీ, ఫిషరీకి రూ.5 లక్షల వరకు రుణం ఇవ్వనుంది. మరోవైపు అస్సాంలోని నామ్‌రూప్‌లో యూరియా ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం నిర్నయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహించి, వారి కాళ్ల మీద నిలబడేలా ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లకు రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించింది. 


తోలు పథకం ద్వారా 22 లక్షల మందికి ఉపాధి  లభించనుంది. భారతదేశాన్ని టాయ్ హబ్‌గా మారుస్తామని కేంద్ర మంత్రి నిర్మలమ్మ చెప్పారు.  బొమ్మల తయారీ కోసం జాతీయ ప్రణాళిక రూపకల్పన చేస్తామన్నారు. అతి పెద్ద లాజిస్టిక్‌ వ్యవస్థ పోస్టల్ శాఖ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ శాఖను మార్చడానికి తాము సిద్ధమని చెప్పారు. దానిని దేశంలోనే అతి పెద్ద లాజిస్టిక్‌ వ్యవస్థ తీర్చిదిద్దేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదించింది. 



ఆదాయపు పన్ను మీద భారీ ఊరట


ఈ బడ్జెట్ మధ్యతరగతి వారికి, వేతన జీవులకు భారీ ఊరట కల్పించింది. కొత్త ట్యాక్స్ విధానం వైపు దేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగా రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను విధించడం లేదని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనికి అదనంగా మరో రూ.75 వేలు స్టాండర్ట్ డిడక్షన్ ఇస్తున్నామని చెప్పారు. అంటే కొత్త ట్యాక్స్ విధానంలో ఓవరాల్ గా ఏడాదిలో రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్ను విధించరు.


Also Read: New Income Tax Bill: ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్, రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్- కొత్త ఐటీ స్లాబ్‌పై కీలక ప్రకటన