Budget 2025 Income Tax Changes: 8వసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సామాన్యులు, ముఖ్యంగా వేతన జీవులలో సస్పెన్స్ పెంచినా కీలక ప్రకటన చేశారు. కొత్త ట్యాక్స్ విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. అదనంగా రూ.75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ తో మరింత రిలీఫ్ కలిగించారు. అంత వరకు వార్షిక వేతనం వచ్చే వారికి ఎలాంటి పన్ను ఉండదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వచ్చే వారం ప్రకటన చేస్తామన్నారు. కొత్త ఐటీ స్లాబ్ లపై వారం రోజుల్లో ప్రకటన చేస్తామని నిర్మలమ్మ బడ్జెట్ స్పీచ్‌లో పేర్కొన్నారు.
వేతన జీవులు అంచనాలేంటీ? 2020 సంవత్సరంలో పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడానికి కొత్త పన్ను వ్యవస్థకు పునాది వేశారు. ఇందులో రాయితీ పన్ను రేట్లు, కొన్ని తగ్గింపులు తొలగించారు. కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రయత్నం. గత బడ్జెట్‌ల్లో కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వ్యక్తుల కోసం మాత్రమే వ్యక్తిగత పన్నులో మార్పులు చేశారు. 2023-24లో ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు 72 శాతం పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. కొత్త పన్ను విధానంలో కొన్ని మార్పులు ఈసారి చేశారు.
ఆదాయపు పన్ను స్లాబ్2025-26 బడ్జెట్‌లో ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ. 300,000 నుంచి రూ. 350,000కి పెంచవచ్చని అనుకున్నారు. కానీ ఏకంగా రూ.12,00,000 (రూ.12 లక్షలు) వార్షిక ఆదాయానికి మనిహాయింపు ఇస్తూ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించింది. మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రవేశపెట్టవచ్చనే అంచనా వేయగా భారీ ఊరట కలిగించింది. దీని ప్రకారం వార్షిక ఆదాయం రూ. 3 లక్షల వరకు ఉన్న వ్యక్తులు పన్ను పరిమితి నుంచి మినహాయింపు ఇస్తుందేమో అనుకున్నారు. ఏకంగా వార్షిక ఆదాయం రూ.12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. నార్మల్ గా రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చిన మోదీ సర్కార్.. అదనంగా రూ.75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తూ మరింత రిలీఫ్ ఇచ్చింది.
ఒకవేళ రూ.12.75 లక్షలు ఆదాయం దాటితే..
- కొత్త ట్యాక్స్ విధానంలో రూ.0-4 లక్షల ఆదాయానికి - 0 శాతం ట్యాక్స్
- రూ.4-8 లక్షల వ్యక్తిగత ఆదాయానికి - 5 శాతం ట్యాక్స్
- రూ.8-12 లక్షల వ్యక్తిగత ఆదాయానికి - 10 శాతం ట్యాక్స్
- రూ.12-16 లక్షల ఆదాయానికి - 15 శాతం ట్యాక్స్
- రూ.16-20 లక్షల ఆదాయానికి - 20 శాతం ట్యాక్స్
- రూ.20-24 లక్షల ఆదాయానికి - 25 శాతం ట్యాక్స్
- రూ.24 లక్షల ఆదాయం దాటితే 30 శాతం ట్యాక్స్
కొత్త పన్ను విధానంలో మినహాయింపు చాలా తక్కువ. ఇందులో, ఎన్‌పిఎస్‌లో ఉద్యోగికి యజమాని ఇచ్చే కంట్రిబ్యూషన్‌ను తగ్గించడం చాలా ముఖ్యమైన విషయం. వాస్తవానికి, గతేడాది ఎన్‌పిఎస్‌పై యజమానులు చేసే ఖర్చుకు తగ్గింపును ఉద్యోగి జీతంలో 10 శాతం నుంచి 14 శాతానికి పెంచారు. అయితే జాతీయ పెన్షన్ స్కీమ్‌కు తో రూ. 50,000 వరకు తగ్గింపు పొందవచ్చు. కొత్త పన్ను విధానంలో ఈ ప్రయోజనాన్ని పెంచుతారని అంచనా వేసుకున్నారు. ఇది జీతం లేని పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. NPSకి కూడా ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం.
మీరు పన్నుపై ఇంత మినహాయింపు పొందవచ్చుసెక్షన్ 87A ప్రకారం కొత్త పన్ను విధానంలో, రూ. 12.75 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు పన్నుపై 100% మినహాయింపును క్లెయిమ్ చేయగలరు.