Budget 2025 Income Tax:బడ్జెట్ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Budget 2025 Income Tax:కేంద్రం ప్రభుత్వం భారీ ఆదాయాన్ని వదులుకొని వేతనజీవులకు ఉపశమనం కలిగించింది. 12 లక్షల వరకు ట్యాక్స్‌ను మినహాయింపు కల్పించింది.

Budget 2025 Income Tax: కొత్త ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉపశమనాన్ని ప్రకటించారు. రూ. 12 లక్షల వరకు (నెలకు సుమారు రూ. 1 లక్ష) ఆదాయం ఉన్న వ్యక్తులను ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. జీతం పొందే పన్ను చెల్లింపుదారులకు, రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా ఈ పరిమితిని రూ. 12.75 లక్షలకు పెంచారు.
"మధ్యతరగతిపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది, దీని వల్ల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉంటుంది." అని ఆర్థిక మంత్రి సీతారామన్ పార్లమెంటులో మాట్లాడుతూ చెప్పారు. గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందన్నారు.
- 0-4 లక్షల వరకు పన్ను లేదు
- 4-8 లక్షల వరకు 5 శాతం పన్ను
- 8-12 లక్షల వరకు 10 శాతం పన్ను
- 12-16 లక్షల వరకు 15 శాతం పన్ను
- 16-20 లక్షల వరకు 20 శాతం పన్ను
- 20-24 లక్షల 25% పన్ను
- రూ. 24 లక్షలకు పైబడి 30%
స్లాబ్ రేటు మార్పులు ఉపశమనం కలిగిస్తాయి
తగ్గించిన స్లాబ్ రేట్లతోపాటు, సాధారణ ఆదాయంలో రూ.12 లక్షల వరకు సంపాదించే వ్యక్తులకు పన్ను నుంచి మినహాయింపు పొందుతారు. ఫలితంగా ఈ ఆదాయంలో ఉన్న పన్ను చెల్లింపుదారులు ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, రూ. 12 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తికి రూ. 80,000 పన్ను ప్రయోజనం లభిస్తుంది, ఇది ప్రస్తుత పన్ను నిర్మాణం ప్రకారం చెల్లించాల్సిన పన్నులో 100% తగ్గింపు ఉంటుంది. అదేవిధంగా రూ. 18 లక్షలు సంపాదించే వ్యక్తికి రూ. 70,000 తగ్గింపు లభిస్తుంది. అయితే రూ. 25 లక్షల ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుకు రూ. 1,10,000 పన్ను ప్రయోజనం లభిస్తుంది.
ప్రభుత్వ ఆదాయ నష్టం
పన్ను చెల్లింపుదారులకు స్పష్టమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి నష్టం కలిగిస్తాయి. మార్పుల ఫలితంగా ప్రత్యక్ష పన్నులలో (ఆదాయ పన్ను) రూ. 1 లక్ష కోట్ల నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. అదనంగా, GST, కస్టమ్స్ సుంకాలు సహా పరోక్ష పన్నులు దాదాపు రూ. 2,600 కోట్ల నష్టం వాటిల్లుతుంది. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించే లక్ష్యంతో ఈ కొత్త పన్ను ప్రతిపాదనలను అమలు చేయడానికి ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంది.
Also Read: ఎంఎస్‌ఈలు, స్టార్టప్‌లకు అదిరిపోయే న్యూస్ - ఏకంగా రూ.20 కోట్ల వరకు రుణాలు