Budget 2025 Health Sector Highlights: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.  ప్రతిపక్షాల ఆందోళన నడుమ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు..ప్రసంగం కొనసాగుతోంది.

గిగ్ వర్కర్లకు గుర్తింపునిస్తూ కార్డులను జారీ చేయనున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో తెలిపారు. ఇప్పటికే రైతులకు పీఎం ధన్ ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు. లేటెస్ట్ గా గిగ్ వర్కర్లకు గుర్తింపునిస్తూ కార్డులను జారీ చేయనున్నారు. ఈ-శ్రమ పోర్టల్ కింద నమోదు చేసుకున్న వారికి ఆరోగ్య బీమాను కూడా ఇవ్వనున్నారు. దాదాపు కోటి మంది గిగ్ వర్కర్లకు పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పనను అందించనున్నారు.  

కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితి పెంచుతూ బడ్జెట్ లో నిర్ణయం తీసుకున్నారు.  రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. దీంతో  7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

Also Read: ‘పద్మశ్రీ’ గ్రహీత కానుకిచ్చిన చీరలో నిర్మలమ్మ .. ప్రతి'శారీ' ప్రత్యేకమే! బడ్జెట్ లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్యాన్సర్‌ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు నిర్మలా సీతారామన్. దేశవ్యాప్తంగా 75 వేల మెడికల్ సీట్లు పెంపునకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. 

ఇండియా పోస్ట్‌ను పెద్ద పబ్లిక్ లాజిస్టిక్స్ సంస్థగా మారుస్తామని  నిర్మలా సీతారామన్ అన్నారు.  విద్యార్థుల సంఖ్య పెంచేందుకు  IITలలో అదనపు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. పాట్నాలోని ఐఐటీని విస్తరణ చేస్తామన్నారు.  

తెలుగు కవి గురజాడ అప్పారావు  చెప్పిన దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే స్లోగన్ సభలో ప్రస్తావించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ ఇస్తున్న సమయంలో విపక్షాలు ఆందోళనకు దిగాయ్.   ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రయాగ్ రాజ్ లో  మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై చర్చకు విపక్ష నేతలు పట్టుబట్టారు. అందుకు స్పీకర్ నిరాకరించడంతో ఆందోళనకు దిగారు. స్పీకర్ నిరాకరించగానే సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి.. నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ కొనసాగించారు.

Also Read: బడ్జెట్‎లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?