Budget 2025 Education Sector: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఎనిమిదవ బడ్జెట్ ప్రసంగంలో ఐదు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అదనంగా 6,500 సీట్లు క్రియేట్ చేయబోతున్నట్టు ప్రకటించారు. IIT పాట్నాను విస్తరిస్తున్నట్లు తెలిపారు. 

"గత 10 సంవత్సరాల్లో 23 IITలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 65,000 నుంచి 1.35 లక్షలకు 100 శాతం పెరిగింది. 2014 తర్వాత ప్రారంభించిన 5 IITల్లో 6,500 మంది విద్యార్థులకు విద్యను సులభతరం చేయడానికి అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాం. " అని సీతారామన్ చెప్పారు. IIT, పాట్నాలో హాస్టల్, ఇతర మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని కూడా విస్తరిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందిస్తామని సీతారామన్ చెప్పారు. పాఠశాలలు, ఉన్నత విద్య కోసం భారతీయ భాషా పుస్తకాల డిజిటల్ రూపాన్ని అందించడానికి ప్రభుత్వం 'భారతీయ భాషా పుష్తక్' పథకాన్ని ప్రారంభిస్తుందని ఆమె తెలిపారు.

విద్య కోసం AIలో ఎక్సలెన్స్ సెంటర్500 కోట్ల వ్యయంతో విద్య కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీతారామన్ ప్రకటించారు. 2023లో వ్యవసాయం, ఆరోగ్యం, స్థిరమైన నగరాల కోసం కృత్రిమ మేధస్సులో మూడు అత్యుత్తమ కేంద్రాలను ఆమె ప్రకటించారు.

వైద్య విద్య విస్తరణరాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో 75,000 సీట్లు పెంచే లక్షంతో అదనంగా 10,000 సీట్లు యాడ్ చేయనుంది. "మా ప్రభుత్వం పదేళ్లలో దాదాపు 1.1 లక్షల యుజి, పిజి వైద్య విద్య సీట్లు పెంచారు. ఇది 130 శాతం పెరుగుదల" అని ఆమె చెప్పారు.

కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని సీతారామన్ ప్రకటించారు. "అన్ని పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చేలా బోర్డు అంతటా స్లాబ్‌లు, రేట్లు మారనున్నాయి." అని ఆర్థిక మంత్రి చెప్పారు.