Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today February 1st: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారిని భర్తగా భావించి జీవితం మొదలు పెట్టమని లక్ష్మీకి స్వామీజీ సూచన!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకానికి స్వామీజీ కడియం ఇచ్చి విహారిని భర్తగా భావించి పూజలు చేస్తేనే విహారికి ప్రమాదాలు ఉండవని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode యమున లక్ష్మీతో విహారి పెళ్లి అయిపోగానే నీకు ఓ మంచి జీవితం ఇస్తానని అంటుంది. ఇక లక్ష్మీ కూడా ఆలోచనలో పడుతుంది. విహారికి ఏం కాకూడదని తాను వ్రతం చేసినప్పుటికీ మళ్లీ ఎందుకు ప్రాణాపాయం వచ్చిందో ఒక సారి స్వామీజీని అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది. 

Continues below advertisement

అంబిక, సుభాష్ కలుస్తారు. ఇన్వెస్టర్లు రోజు రోజుకు ఎక్కువ టార్చర్ పెడుతున్నారని సుభాష్ చెప్తాడు. ఇంతలో అక్కడికి ఇన్వెస్టర్ దామోధర్ వచ్చి సుభాష్‌ని రౌడీలతో చితక్కొట్టిస్తాడు.  అంబిక ఎంత చెప్పినా వినకుండా కొడతారు. తర్వాత అంబికకు వార్నింగ్ ఇస్తారు. లెక్కల గురించి విహారికి చెప్తారా లేక మేమే విహారి చెప్పాలా అని అడుగుతారు. దాంతో అంబిక వారం రోజులు గడువు అడుగుతుంది. 

సుభాష్: అంబిక ఆ లెక్కలు అన్నీ బయటకు వస్తే ఇప్పటి వరకు మనం ఆడిన నాటకాలన్నీ బయటకు వచ్చేస్తాయి. విహారికి తెలియకుండా జాగ్రత్త పడాలి. 
చారుకేశవ: హాయ్ అంబిక, హాయ్ సుభాష్.
అంబిక: వీడు ఒకడు పుండు మీద కారం వేయడానికి వచ్చేస్తాడు.
చారుకేశవ: ఏమైంది బాగా కావాల్సిన వారు ఎవరో చితకబాదినట్లు ఉన్నారు. అప్పుల వాళ్లా లేక నీ చేతిలో మోసపోయిన వాళ్లా. అంబిక రేపో మాపో మన ఆఫీస్‌లో ఆడిడర్లు లెక్కలు చూస్తారు. నీ తప్పు లెక్కలు బయట పడితే విహారి నిన్ను మెడ పట్టుకొని బయటకు పంపేయడం ఖాయం. 
అంబిక: బావ మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా వెళ్లవా. సుభాష్ ఆడిటర్లు లెక్కలు చూస్తే మన బండారం బయట పడినట్లే. ఏదో ఒకటి చేసి ఈ గండం నుంచి గట్టెక్కాలి.
లక్ష్మీ: స్వామీజీ దగ్గరకు వెళ్లి.. స్వామి అక్కడ కొడుకు పెళ్లి కుదిరింది అన్న సంతోషం యమున అమ్మ గారిలో లేదు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన విహారి గారిలోనూ సంతోషం లేదు. నేను పూజ చేస్తే విహారి గారు సంతోషంగా ఉంటారని చెప్పారు. కానీ ఆ ఇంట్లో ఆందోళన తప్ప సంతోషం కనిపించడం లేదు. ఆయన ఆందోళనకు ఒక విధంగా నేనే కారణం అని తన తాళి తెగిపోవడం, విహారికి బాణం తగలడం మళ్లీ పెళ్లి మొత్తం చెప్తుంది. 
స్వామీజీ: నేను చెప్పినట్లే చేశావా తల్లి. నీ పూజలో తప్పు లేదు కానీ నీ సంకల్పంలో తప్పు ఉంది. విహారి బాగుండాలి ఆయన కుంటుంబం బాగుండాలి అని పూజలు చేస్తున్నావ్ కానీ నా భర్త బాగుండాలి ఆయన కుటుంబం బాగుండాలి అని పూజలు చేయకపోతే ఫలితం ఎలా వస్తుంది తల్లీ. 
లక్ష్మీ: కలవ బోతున్న ఆ రెండు ఫ్యామిలీలకు నేను అడ్డు కాకూడదు. విహారి బాబు, సహస్రమ్మల పెళ్లి జరగాలి. 
స్వామీజీ: తప్పమ్మా. చూడమ్మా తల రాతని త్యాగం చేయకూడదు. ఆ భగవంతుడు వేసిన బంధాన్ని కాదు అనకూడదు. మీ మధ్య జరిగింది బొమ్మల పెళ్లి కాదు. ఆ దైవానుగ్రహంతో జరిగింది. అతని భార్యగా నీ బాధ్యతని నిండు నూరేళ్లు నువ్వు మోయాల్సిందే. నీ గుండెల్లో ఆ మాంగల్యం ఉన్నంత కాలం నీ గుండెల్లో అతన్ని ఆరాధించాల్సిందే. అతన్ని వేరుగా చూసి నువ్వు ఎన్ని పూజలు చేసినా అది వృథానే.
లక్ష్మీ: స్వామీ అలా మాట్లాడొద్దు. మీ మాటలు వినడానికి నాకు చాలా కష్టంగా ఉంది. 
స్వామీజీ: కష్టమైనా నిజం ఒప్పుకోవాల్సిందే. ఓ కంకణం ఇచ్చి.. పంచ లోహాలతో చేసిన ఈ కంకణం విహారి భర్త ఎదురుగా నువ్వు తనని భర్తగా భావించి ఇకపై అతనితోనే నీ జీవితం అనుకొని ఇది అతని చేతికి తొడిగితే ఇక అతనికి అతని కుటుంబానికి ఏం ఇబ్బంది ఉండదు. నీ భర్త మేలు కోసం ఈ కంకణం కట్టు. విహారిని నీ భర్తే అనుకొని ఈ కంకణం తొడగాలి. అలా చేయలేను అని నవ్వు అనుకంటే ఆ కంకణాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచేసి నువ్వు వెళ్లిపోవచ్చు. లక్ష్మీ కంకణం తీసుకొని తన కొంగుకు కట్టుకొని బయల్దేరుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సంధ్యని లాక్కెళ్లిన తల్లి.. నా జీవితం నా ఇష్టం అంటూ ఫైర్.. పోలీసులకు కంప్లైంట్!

Continues below advertisement