Satyabhama Serial Today Episode క్రిష్‌ సత్యతో తాను గుడిలో ఉన్నానని చెప్తాడు. నేను లేకుండా నువ్వు గుడికి ఎందుకు వెళ్లావని అడుగుతుంది. రావాల్సి వచ్చిందని అంటాడు. సత్య, సంజయ్ ఇద్దరూ తన దగ్గరే ఉన్నారని క్రిష్ చెప్తాడు. సత్య ఎన్ని ప్రశ్నలు వేసినా క్రిష్ ఏం సమాధానం చెప్పకుండా మీ అమ్మానాన్నల్ని తీసుకొని మన ఇంటికి వచ్చేయ్ నేను వాళ్లని తీసుకొని మన ఇంటికి వస్తున్నా అంటాడు. అక్కడ ఏం జరుగుతుందని సత్య అనుకుంటుంది. సంజయ్, సంధ్య ఇద్దరూ క్రిష్‌తో మహదేవయ్య ఇంటికి వస్తారు.  

సంజయ్: బ్రో భయంగా ఉంది. బిగ్ డాడీ ఏమంటారో.క్రిష్: ఈ భయం నువ్వు అడుగు బయట పెట్టినప్పుడు ఉండాలి.మహదేవయ్య: వీడేంటి దీన్ని పెళ్లి చేసుకొని వచ్చాడు ప్లాన్ మొత్తం ఖరాబు చేశాడు.  జయమ్మ: ఓరేయ్ ఏంట్రా నువ్వు చేసిన పని. పెద్దవాళ్లకి తెలీకుండా పెళ్లి ఏంట్రా. అయినా నీకు మీ ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు కదమ్మా.సంధ్య: అది ఇష్టం లేకే ఇలా పెళ్లి చేసుకున్నా.జయమ్మ: అంటే మీ ఇంట్లో కూడా చెప్పలేదా.భైరవి: ఏంట్రా నువ్వు చేసిన పని బుద్ధి ఉందా నీకు తీయురా మెడలో దండ తీసేయ్.సంధ్య: మెడలో తాళి చూపిస్తూ మరి ఇది.క్రిష్: ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది పెద్ద మనసుతో అర్థం చేసుకొని దీవించడం. నువ్వు ఇప్పుడు తల్లి స్థానంలో ఉన్నావ్ వాళ్లకి హారతి ఇచ్చి లోపలికి పిలువు.భైరవి: విరక్కొడతా అది లోపలికి వస్తే కాళ్లు విరక్కొడతా. చెప్పు దానికి. సంధ్యని పెళ్లి చేసుకుంటాను అంటే నీ పెళ్లాం స్వీట్‌లు నేలకి విసిరింది. అయినా నీకు ఇజ్జత్ లేదురా కానీ నా పెనిమిటికి ఉంది. నీకు మీ పెద్దనాన్న మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా దీన్ని వదిలేయ్ నువ్వు ఒక్కడివే లోపలికి రా. కాదు అదే కావాలి అనుకుంటే ఇద్దరూ బయటకు పొండి.రుద్ర: ఎవరిని అడిగి కట్టాడు.క్రిష్: సంజయ్ చక్రవర్తి బాబాయ్ కొడుకు వాడి ఇష్టం మీద మనకు హక్కు లేదు.జయమ్మ: వాడి మీద మనకు హక్కు లేనప్పుడు వాడు మన ఇంట్లో ఎందుకురా పొమ్మను వాళ్ల ఇంటికే పొమ్మను. వాళ్ల నాన్న హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తాడు.భైరవి: మీ తమ్ముడిని పిలిపించు అయ్యా. కొడుకుని పెంచడం చేత కాక మన మీదకు విడిచిపెడతాడా. మనకు ఈ నెత్తి నొప్పి వద్దు పొమ్మను.మహదేవయ్య: వాడు పోడు ఇక్కడే ఉంటాడు. వాడిని నా కొడుకులతో సమానంగా చూసుకుంటున్నా. తప్పు చేశాడని పొమ్మనలేను. ఇక్కడే ఉంటాడు.క్రిష్: వదిన నువ్వు హారతి ఇవ్వు.రుద్ర: ఏయ్ వద్దు.. నా పెళ్లాం హారతి ఇస్తే అది ఇంటి నుంచి పోతుంది. నీ పెళ్లానికి ఇష్టం లేని పెళ్లి ఇది ఎవరూ దాని మాటలు పడతారు.క్రిష్: సంధ్య ఈ ఇంట్లో నీకు హారతి ఇచ్చే దిక్కులేదు అంత మంచి మనసు ఎవరికీ లేదు మీరే దేవుడికి దండం పెట్టుకొని కుడికాలు లోపల పెట్టి రండి.సత్య: (రేణుక సంధ్యని గదిలోకి తీసుకెళ్తుంటే) ఆగు..క్రిష్: ఆగు సత్య: పక్కకు జరుగు క్రిష్. కావాలని నువ్వే దగ్గరుండి పెళ్లి చేశావ్ కదూ.విశ్వనాథం: ఇది మా కుటుంబ సమస్య సంధ్యని మాకు అప్పగించు బాబు.హర్ష: ఈ పెళ్లి మాకు ఇష్టం లేదని తెలుసు అయినా ఈ పెళ్లి ఎలా జరిపించావ్.విశాలాక్షి: ఎన్నో సార్లు మమల్ని సమస్యల నుంచి తప్పించావు ఇప్పుడేంటి ఇలా సమస్యల్లో నెట్టేశావు బాబు.

విశాలాక్షి సంధ్యని లాక్కెత్తుంటే సంధ్య నా ఇష్టం నన్ను వదిలేయండి అంటే సత్య లాగిపెట్టి ఒకటిస్తుంది. ఏంటే నీ ఇష్టం అని అరుస్తుంది. క్రిష్ వద్దని ఏం అనొద్దని  అంటాడు. ప్రేమగా పెంచుకున్న తండ్రిని తల దించుకునేలా చేసిందని సత్య అంటుంది. దాంతో సంధ్య బలవంతంగా తనకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసి జీవితం నాశనం చేయాలి అని చూస్తున్నావ్ అక్క అని అంటుంది. నీ మొండి తనంతో నన్ను వేధించకుండా నీ జీవితం నువ్వు చూసుకో అంటుంది. సంధ్య మాటలకు అందరూ షాక్ అయిపోతారు. విశ్వనాథం సంధ్య మీద అరుస్తాడు. నేను ఉన్న ప్లేస్‌లో అక్కా బావ ఉండి ఉంటే అమ్మా అయ్యా అని బుజ్జగిస్తారు. మీకు అక్క ఇష్టం నేను ఇష్టం లేదు అక్క విషయంలో ప్రేమ పెళ్లికి ఒప్పుకొని నా పెళ్లి ఎందుకు ఒప్పుకోవడం లేదని సంధ్య అరుస్తుంది. ఈ కుటుంబం మీద కోపం అయితే అక్కని కూడా తీసుకెళ్లిపోదాం నేను మీతో వస్తా పదండి అని అంటుంది. 

విశాలాక్షి బలవంతంగా తీసుకెళ్లబోతే నేను సంజయ్ భార్యని నా మీద మీకు హక్కు లేదు నేను మేజర్‌ని అని అరుస్తుంది. క్రిష్ కూడా వాళ్ల పెళ్లి అయిపోయింది అని చెప్తే దానికి సత్య నా చెల్లి ఒంటరిగా అయినా బతుకుతుంది కానీ సంజయ్‌కి ఇవ్వను అని అంటుంది. ఇంతలో పోలీసులు వస్తారు. తన ఫ్యామిలీ వల్ల తనకు ముప్పు ఉందని పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. పోలీసులతో సంధ్య తనని బలవంతంగా లాక్కెళ్తున్నారని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ సాక్షిగా సంజయ్, సంధ్యల పెళ్లి.. తలోదిక్కూ తలపట్టుకొని ఏడుపు.. సత్యకి నిజం తెలిస్తే!