Top Telugu Headlines Today 25 June 2023:
ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే మంచిది, అనిల్‌కి ఎమ్మెల్యే కోటంరెడ్డి వార్నింగ్
నెల్లూరు రాజకీయం ఓ రేంజ్ లో వేడెక్కింది. చాలా కాలం గ్యాప్ తర్వాత నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెరపైకి రావడం, వచ్చీ రాగానే ఆయన లోకేష్ పాదయాత్రను టార్గెట్ చేయడం, అందులోనూ అరేయ్, ఒరేయ్ అంటూ కాస్త ఘాటు పదాలు వాడటంతో టీడీపీ నేతలు కౌంటర్లిస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి.. తాజాగా అనిల్ ని టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. అనిల్ కి వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని, ఉన్నన్ని రోజులైనా ఆయన నియోజకవర్గ ప్రజలతో మంచి అనిపించుకోవాలని హితవు పలికారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని వార్నింగ్ ఇచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి. అనిల్ భాషను ఆ నియోజకవర్గం ప్రజలే అవమానంగా భావిస్తున్నారని చెప్పారు. పూర్తి వివరాలు
నా తండ్రి అక్రమ స్థలం మున్సిపాలిటీకి ఇచ్చేస్తా: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వ్యతిరేకంగా ఓ స్థలం విషయంలో పోరాటం చేస్తున్న ఆమె కుమార్తె మరోసారి మీడియా ముందుకు వచ్చారు. సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి కింది స్థలం.. తన తండ్రి తన పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఈ మేరకు ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీ రెడ్డి ఆదివారం (జూన్ 25) మీడియా ముందుకు వచ్చారు. ఆ స్థలాన్ని తిరిగి మున్సిపాలిటీకి అప్పగిస్తానని ఆమె తేల్చి చెప్పారు. పూర్తి వివరాలు
పాదయాత్రలో అడుగులో అడుగేసి మీ గెలుపు కోసం వస్తున్నా అన్నా: బండ్ల గణేష్ పొలిటికల్ రీఎంట్రీ!
అన్నా వస్తున్నా.. అడుగులో అడిగేస్తా, చేతిలో చెయ్యేస్తా అంటూ సినీ నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొనబోతున్నట్లు వెల్లడించారు. భట్టిని కలిసేందుకు సూర్యాపేట వెళ్తున్నట్లు వివరించారు. "కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోటానికి, మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నానంటూ" ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. జై కాంగ్రెస్, జైజై కాంగ్రెస్ అంటూ రాసుకొచ్చారు. పూర్తి వివరాలు
కన్నా ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఫండ్ పంపితే మొత్తం మింగేశాడు: అంబటి ఆరోపణలు
మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం జగన్ పై మాజీ మంత్రి కన్నా అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అని పేర్కొన్నారు. సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కన్నాపై తీవ్ర విమర్శలు చేశారు. రాజారెడ్డి గురించి ముఖ్యమంత్రి జగన్ గురించి అవాకులు చవాకులు పేల్చే స్థాయి కన్నా లక్ష్మీ నారాయణకు లేదన్నారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో కన్నాకే తెలియదంటూ ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబును తిట్టి.. ఇప్పుడు ఆయన ఫోటోకే పాలాభిషేకం చేస్తున్నారని గుర్తు చేశారు. పూర్తి వివరాలు
మహారాష్ట్రలో 2 రోజుల పర్యటనకు కేసీఆర్, పూర్తి షెడ్యూల్ ఇదీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 26, 27 తేదీల (రేపటి నుంచి) నుంచి ఆయన మహారాష్ట్ర పర్యటన ఉండనుంది. మహారాష్ట్రలోని పండరీపూర్, తుల్జాపూర్‌లో ఆలయాల్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సోలాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న సభలో పాల్గొంటారు. జూన్ 26న (సోమవారం) ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారానే సుదీర్ఘ దూరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లనున్నారు. పూర్తి వివరాలు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial