Top 5 Telugu Headlines Today 21 July 2023:
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అప్‌డేట్- సాక్షిగా షర్మిల ఏం చెప్పారంటే?
మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ కేసులో వైఎస్ షర్మిల వాంగ్మూలాన్ని కూడా సీబీఐ రికార్డు చేసింది. పులివెందుల ఎంపీ సీటుకు సంబంధించిన కీలక సమాచారం ఇచ్చినట్టు సీబీఐ తన షార్జిషీట్‌లో పేర్కొంది. గూగుల్ టేక్ అవుట్ లాంటి సాంకేతిక అంశాలపై కూడా సీబీఐ వివరణ ఇచ్చింది. వీటన్నింటిని కొద్ది రోజుల క్రితం కోర్టుకు సమర్పించింది. ఇప్పుడు అందులోని అంశాలు బయటకు వస్తున్నాయి. మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో గూగుల్ టేక్ అవుట్ సమాచారంపై సీబీఐ తడబడినట్టు తెలుస్తోంది. గ్రీన్‌విచ్ కాలమానం, భారత కాలమానం ప్రకారం తేడా గుర్తించలేకపోయామని పేర్కొన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు
విభజన చట్టం ప్రకారం ఏపీ హైకోర్టు ఏర్పాటు - తరలించే ప్రతిపాదనేదీ లేదన్న కేంద్రం !
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించాలనే ప్రతిపాదన ఏదీ ఏపీ ప్రభుత్వం నుంచి రాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. శుక్రవారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ రాతపూర్వక సమాధానంలో వివరాలు వెల్లడించారు. 2014 విభజన చట్టం ప్రకారం అమరావతి కేంద్రంగా ఏపీ హైకోర్టు ఏర్పాటు అయ్యిందని కేంద్రం పేర్కొంది. 2019 జనవరి ఒకటి నుంచి అమరావతిలో ఏపీ హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు పూర్తిస్థాయి ప్రతిపాదనేదీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో లేదని తెలిపింది. పూర్తి వివరాలు
నాందెడ్ నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారా ? మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి అందుకేనా ?
టీఆర్ఎస్‌ను భారత రాష్ట్రసమితిగా కేసీఆర్ మార్చారు కానీ.. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా బీఆర్ఎస్ ను విస్తరించేందుకు ఆసక్తి చూపించడం లేదు. మొదట్లో ఇతర రాష్ట్రాలకు చెందిన నేతల్ని ప్రగతి భవన్ కు పిలిపించి చర్చించేవాళ్లు. ఏపీ, ఒడిషాలకు స్టేట్ ఇంచార్జులను నియమించారు. కానీ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఒక్క మహారాష్ట్రలో మాత్రం అదీ కూడా ఓ ప్రాంతంలో మాత్రమే ప్రత్యేక దృష్టి పెట్టి పార్టీని విస్తరిస్తున్నారు. దీని వెనుక అసలు కారణం ఏమిటన్నది ఎవరికీ తెలియదు. కానీ.. కేసీఆర్ మహారాష్ట్ర నుంచి లోక్ సభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం మాత్రం గుప్పుమంటోంది. పూర్తి వివరాలు
అమ్మాయిలను లోబర్చుకొని కాపురం చేసి వదిలేయడం పవన్‌కు అలవాటు- సీఎం జగన్
పవన్, చంద్రబాబుపై మరోసారి సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్‌పై తీవ్ర కామెంట్స్ చేశారు. అమ్మాయిలను లోబర్చుకొని నాలుగేళ్లు కాపురం చేయటం దత్తపుత్రుడిగి అలవాటు అంటూ ఘాటుగా స్పందించారు. చంద్రబాబుకు వాలంటీర్‌గా పని చేస్తున్న వ్యక్తి వాలంటీర్ వ్యవస్థను తప్పుబడుతూ వాళ్ల క్యారెక్టర్‌పై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలోని వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్... మంచి చేస్తున్న వారిని సంస్కారం ఉన్న ఎవరు అవమానించరని అన్నారు. మంచి చేస్తున్న వాలంటీర్లను గురించి సంస్కారం కోల్పోయి కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలు
నెల రోజుల వర్షం ఒక్కరోజే- గురువారం 34.5 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు
రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. నెలరోజులుగా కురవని వర్షం అంతా గురువారం ఒక్కరోజే కురిసింది. ఈ వర్షం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నా, పట్టణాలు, నగరాల్లో ఉండే చాలా మంది ప్రజలు మాత్రం తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఇంకెన్ని రోజులు రా బాబు ఈ వర్షం అనుకుంటున్నారు. అయితే గురువారం రోజు కుమురం భీం జిల్లా బెజ్జూరులో 20 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అలాగే హైదరబాద్ సహా అన్ని నగరాలు, పట్టణాలు, మండలాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం అయ్యాయి. హైదరాబాద్ లో రహదారులు చెరువులను తలపించాయి. పూర్తి వివరాలు