పవన్, చంద్రబాబుపై మరోసారి సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్‌పై తీవ్ర కామెంట్స్ చేశారు. అమ్మాయిలను లోబర్చుకొని నాలుగేళ్లు కాపురం చేయటం దత్తపుత్రుడిగి అలవాటు అంటూ ఘాటుగా స్పందించారు. చంద్రబాబుకు వాలంటీర్‌గా పని చేస్తున్న వ్యక్తి వాలంటీర్‌ వ్యవస్థను తప్పుబడుతూ వాళ్ల క్యారెక్టర్‌పై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. 


తిరుపతిలోని వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్... మంచి చేస్తున్న వారిని సంస్కారం ఉన్న ఎవరు అవమానించరని అన్నారు. మంచి చేస్తున్న వాలంటీర్లను గురించి సంస్కారం కోల్పోయి కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాలంటీర్లును మనవాళ్ళు, మనవరాళ్లుతో పోల్చారు సీఎం జగన్


తప్పుడు మాటలకి స్క్రిప్ట్ రామోజీ రాసిస్తే.. చంద్రబాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారని జగన్ అన్నారు. దానికి దత్తపుత్రుడు నటిస్తున్నారని మండిపడ్డారు. మహిళల అక్రమ రవాణా అంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అన్యాయంగా బురద జల్లుతున్నారని వాపోయారు. పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్‌గా పనిచేస్తున్న వ్యక్తే మన వాలంటీర్లు క్యారక్టర్‌ను తప్పు పడుతున్నారని విమర్శించారు. 


అమ్మాయిలను లోబర్చుకొని నాలుగేళ్లు కాపురం చేయటం దత్తపుత్రుడికి అలవాటని ఘాటు వ్యాఖ్యలు చేసారు. అదే టైంలో బాలయ్య, లోకేష్‌పై కూడా జగన్ సీరియస్ కామెంట్స్ చేశారు. బాలయ్య ని దౌర్భాగ్యుడు అని సంబోధించారు. ఆహా షో లో బాలయ్య, చంద్రబాబు కామెంట్స్‌పను ప్రస్తావిస్తూ బాలకృష్ణను విమర్శించారు. 


ఒకరు నాలుగేళ్లకోసారి అమ్మాయిలను లోబర్చుకొని కాపురం చేసి వదిలేస్తారని పవన్‌ ఉద్దేశించి మాట్లాడారు జగన్. ఇంకొకరు స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో దొరికిపోతారని, మరొకరు అమ్మాయిక కనిపిస్తే కడుపు చేయాలని అంటారని లోకేష్, బాలకృష్ణ గురించి ప్రస్తావించారు జగన్. ఇలాంటి వారి మాటలు నమ్మొద్దని ప్రజలకు జగన్ సూచించారు.