Top 5 Telugu Headlines Today 20 October 2023:
ఫైబర్ నెట్ కేసు - చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా, అప్పటివరకూ అరెస్ట్ చెయ్యొద్దని ఆదేశం
ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నవంబర్ 9కు విచారణ వాయిదా వేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ముందస్తు బెయిల్ పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం శుక్రవారం బెయిల్ పిటిషన్ పై విచారించింది. తొలుత నవంబర్ 8కు వాయిదా వేయగా, చంద్రబాబు తరఫు న్యాయవాదుల విజ్ఞప్తితో నవంబర్ 9కు వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
చెప్పిన హమీల్లో ఒక్కటీ అమలు చేయని సీఎం - ఏపీ హేట్స్ జగన్ పుస్తకం రిలీజ్ చేసిన టీడీపీ !
ఏపీ హేట్స్ జగన్ పేరుతో టీడీపీ పుస్తకాన్ని విడుదల చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. విద్యుత్ ఛార్జీల భారం రూ.64 వేల కోట్లు వేశారని.. నాసిరకం మద్యంతో 35 లక్షల మందిని రోగాల బారిన పడేలా చేశారని పుస్తకంలో వివరించారు. రాష్ట్రాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా భ్రష్టు పట్టించారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు అన్నారు. నాసిరకం మద్యం వల్ల 30 వేలమంది ప్రాణాలు పోయాయన్నారు. ఉచిత ఇసుక విధానం రద్దు వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని టీడీపీ ఆరోపించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని జగన్ చెప్పారని.. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దుచేస్తామన్నారు.. చేశారా? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
'గాంధీజీ ఆనాడే ఊహించారేమో.. అందుకే అలా అన్నారు' - రాహుల్ పై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. అవినీతి గురించి రాహుల్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. 'టికెట్లు అమ్ముకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు కేసులో ఆయన ఇప్పటికే పట్టుబడ్డాడు. స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ అవసరం లేదని గాంధీజీ అన్నారు. ఇలాంటి వారు కాంగ్రెస్ లో ఉంటారని ఆయన ఆనాడే ఊహించారేమో.? పీసీసీ పోస్టును రూ.50 కోట్లకు అమ్మారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు - వీఆర్ఎస్ తీసుకొని ఎన్నికల్లో పోటీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టేశారు. నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి, ప్రత్యర్థులపై పైచేయి సాధించారు. ఇప్పటికే మెజార్టీ అభ్యర్థులకు బీఫారాలను అందజేశారు. బీఫారాలు అందుకున్న నేతలు నియోజకవర్గాల్లో ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. ఇటు కేసీఆర్ ప్రతి రోజు 2, 3 నియోజకవర్గాలను తిరుగుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ముఖ్య నేత - కూకట్ పల్లి టిక్కెట్ ఆఫర్ !
భారత రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి రమేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బస్సుయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం శేరిలింగం పల్లి నుంచి బీఆర్ఎస్ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు గ్రేటర్ మేయర్ పదవిని ఆశించినా ప్రయోజనం లేకపోవడంతో బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న ఆయన.. కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. కూకట్ పల్లిలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కొరత ఉండటం సామాజిక వర్గ పరంగా కలసి వచ్చే నేత కావడంతో బండి రమేష్ కు టిక్కెట్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి