తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది- పోలింగ్ ఎప్పుడంటే?
ఎన్నో ఊహాగానాలు, మరెన్నో అంచనాలు మధ్య తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. 
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్:  3 నవంబర్‌ 2023
ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తేదీ-  3 నవంబర్‌ 2023
ఎన్నికల నామినేషన్లకు తుది గడువు -  10 నవంబర్‌ 2023
నామినేషన్ల స్క్రూట్నీ తేదీ-  13 నవంబర్‌ 2023
నామినేషన్ల  ఉపసంహరణకు ఆఖరు తేదీ-  15 నవంబర్‌ 2023
పోలింగ్‌ తేదీ- 30 నవంబర్ 2023
కౌంటింగ్ తేదీ- 3 డిసెంబర్‌ 2023 పూర్తి వివరాలు



నవంబర్‌ 1 నుంచి ఏపీ నీడ్స్‌ జగన్ కార్యక్రమం- ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన ఏపీ సీఎం
వైసీపీ తప్ప దేశంలో ఏ పార్టీ  కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. మేనిఫెస్టోలో ఇచ్చినహామీలను 99శాతం అమలు చేశామన్నారు. సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు న్యాయం చేశామన్నారు. మార్చి , ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రజలకు సేవకుడిగా సేవలందించాను కాబట్టే 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన అందించామన్నారు సీఎం జగన్,  మూడు ప్రాంతాల ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులు ఏర్పాటు చేశామన్నారు. అధికారాన్నిఇచ్చిన ప్రజలకు తొలి సేవకుడి బాధ్యతగా తీసుకున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు


ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్, బెయిల్ పిటిషన్లు కొట్టివేత
ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంగళ్లు అల్లర్ల కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు  లంచ్ తర్వాత రెండు పిటీ వారెంట్లపైన విచారణ జరిగే అవకాశం ఉంది. లంచ్ తర్వాతే చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పు ఇస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రథమ ముద్దాయిగా ఉన్నారు. పోలీసులు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు


తెలంగాణ ఎన్నికల్లో గెలిచేదెవరు- పార్టీల బలమేంటీ? బలహీతనలేంటీ?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు జరిగేవి మూడో దఫా అసెంబ్లీ ఎన్నికలు. 2014, 2018లో బీఆర్‌ఎస్‌  ఘనవిజయం సాధించింది. ఈసారి జరగబోయే ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని సీఎం కేసీఆర్‌ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక కర్ణాటక విజయం సాధించిన కాంగ్రెస్‌.. తెలంగాణలోనూ అదే ఫార్ములాతో గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక... కమలం పార్టీ బీజేపీ కూడా తెలంగాణలో పాగా వేసేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ మూడు ప్రధాన  పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. మరి తెలంగాణలో ఓటర్లు ఎటు మొగ్గు చూపుతున్నారు. మూడు పార్టీల బలాబలాలు... ఓటు షేర్‌ వివరాలను ఒకసారి  పరిశీలిద్దాం. పూర్తి వివరాలు


తెలంగాణలో BRS హ్యాట్రిక్ కొడుతుందా? 5 రాష్ట్రాల ఎన్నికలపై ABP C Voter ఒపీనియన్ పోల్ ఏం చెప్పనుంది?
ఎన్నికల సమయం వచ్చిందంటే రకరకాల సర్వేలు తెగ హడావుడి చేసేస్తాయి. కానీ...అందులో కొన్ని మాత్రం సైంటిఫిక్‌గా ఉంటాయి. ఇలాంటి సైంటిఫిక్‌ సర్వేలు, ఒపీనియన్ పోల్స్‌లో ముందంజలో ఉంటుంది ABP C Voter సర్వే. ఈ ఏబీపీ సీ ఓటర్‌ ఒపీనియన్ పోల్స్‌ని అంచనాలను, ఫలితాలను పరిశీలిస్తే చాలా దగ్గరగా ఉంటాయి. అంటే అక్యురసీ చాలా ఎక్కువ. ఇటీవలే జరిగిన కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ గెలుస్తుందని ముందుగానే చెప్పింది ABP C Voter Opinion Poll. అంచనా వేసినట్టుగానే కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ పోల్ ఎంత కచ్చితంగా ఉంటుందో చెప్పడానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. పూర్తి వివరాలు