Yatra2 First Look : ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర'(Yathra) మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్​ను అందుకున్న విషయం తెలిసిందే. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. మహి. వి రాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో విడుదలై సూపర్ హిట్​గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్​గా 'యాత్ర 2'(Yathra2) రాబోతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటు చేసుకున్న సంఘటన ఆధారంగా ఈ సీక్వెల్​ని దర్శకుడు మహి వీ రాఘవ తెరికెక్కించారు.


వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యంగ్ హీరో జీవా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్​ని అందుకోగా.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్​ని విడుదల చేశారు మేకర్స్. ముందు అనౌన్స్ చేసినట్లుగానే 'యాత్ర 2' ఫస్ట్ లుక్​ను సోమవారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్​లో ఓవైపు జీవా మరోవైపు మమ్ముట్టి ఇంటెన్స్ లుక్​లో కనిపించారు." నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని" అంటూ పోస్టర్లో రాసుకొచ్చారు. దాంతోపాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 8న 'యాత్ర 2' ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.






ప్రస్తుతం 'యాత్ర 2' ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో 'యాత్ర' సినిమా వస్తే ఇప్పుడు వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరును 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్​లో జరిగిన రాజకీయ ఘటనలను 'యాత్ర 2'లో చూపించనున్నారు. సరిగ్గా 2024 ఎన్నికల సమయంలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడం గమనార్హం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, మది కెమెరామాన్ బాధ్యతలు చేపట్టారు. త్రీ ఆటమ్ లీవ్స్, వి సెల్యులాయిడ్ బ్యానర్స్​పై శివ మేక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఇదిలా ఉంటే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం వైయస్ జగన్ బయోపిక్​గా 'వ్యూహం'(Vyuham) అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీరును 2009 నుంచి 2019 వరకు ఏపీలో జరిగిన రాజకీయ సంఘటనలను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ బయోపిక్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో ప్రముఖ నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా అతని భార్య వైయస్ భారతి క్యారెక్టర్​లో మానస రాధాకృష్ణన్ కనిపించనుంది. డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.


Also Read : రియా చక్రవర్తిపై సమంత ఆసక్తికర కామెంట్ - వైరల్​గా మారిన పోస్ట్!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial