నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్​టైనర్ 'భగవంత్‌ కేసరి'. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో బాలయ్య కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీలా కనిపించనుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్​గా నటిస్తోంది. దసరా స్పెషల్​గా థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్, హన్మకొండ నగరంలోని ఆర్ట్స్‌ కాలజీ గ్రౌండ్స్​లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ తన జీవితంలో లేని అనుభవాలను ఈ సినిమా ద్వారా బాలయ్య అందించారని ఎమోషనల్ అయ్యారు.


శ్రీలీల మాట్లాడుతూ.. ''నేను చిన్నప్పుడు వరంగల్​కి వచ్చా. కానీ నేను ఈరోజు ఇక్కడికి శ్రీలీలగా రాలేదు.. విజ్జి పాపగా వచ్చాను. ఈ సినిమాలో నేను వరంగల్ పిల్లగా నటించాను. ఒక హీరోయిన్​గా పలు సినిమాలు చేస్తున్నాను. వేర్వేరు సెట్స్​కి వెళ్తున్నాను. కానీ ఒక సోల్ కనెక్ట్ క్యారెక్టర్ అనేది ప్రతీ సినిమాలో దొరకదు. అలాంటి బ్యూటిఫుల్ క్యారక్టర్ ఇచ్చినందుకు, ఈ సినిమాలో నన్ను భాగం చేసినందుకు దర్శకుడు అనిల్ రావిపూడికి కృతజ్ఞతలు. ఇదొక బ్యూటిఫుల్ స్టోరీ. నాకు కథ చెప్పినప్పుడే నేను చాలా కనెక్ట్ అయ్యాను. అది నాకు ఎమోషనల్ మూమెంట్. రోజులు గడిచే కొద్దీ నేను విజ్జి పాపగా మారిపోయాను. ఎందుకంటే ఆ పాత్రని డైరెక్టర్ ఎంతో అందంగా ప్రేమించి రాశారు. అంతే పర్టిక్యులర్​గా తీశారు. నిజంగా అలాంటి పాత్ర నాకు దక్కడం నా అదృష్టం'' అని అన్నారు. 


''బాలకృష్ణగారితో కలిసి పనిచేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. చివరి రోజు షాట్ అయిపోయి కట్ చెప్పిన తర్వాత నాకు మాటలు రాలేదు. అది నాకు చాలా ఎమోషనల్ టైం. ఈ చిత్రంలో చాలా బ్యూటీఫుల్ సీన్లు ఉన్నాయి. కొన్ని సీన్లు చేసేటప్పుడు కట్ చెప్పినా కూడా నేను అదే మూడ్​లో కంటిన్యూ అయ్యాను. ఎందుకంటే నేను దాన్నుంచి వెంటనే బయటకి రాలేకపోయాను. అలాంటి సందర్భాల్లో బాలయ్య గారు జోకులేసి నవ్వించేవారు. నాకు ఎంతో సపోర్ట్​గా నిలిచారు. నా లైఫ్​లో ఏ ఎక్స్​పీరియన్స్ లేదో, అది ఈ సినిమా ద్వారా నాకు ఇచ్చారు. మీ గొప్ప మనసుకి థాంక్యూ సో మచ్. ఇలాంటి అందమైన కథతో బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం. సినిమాలో సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు'' అంటూ శ్రీలీల ఎమోషనల్​గా మాట్లాడారు. 


Also Read: టాలీవుడ్ న్యూ ఏజ్ లేడీ ప్రొడ్యూసర్స్ - సినిమా నిర్మాణంలో సత్తా చాటుతున్న వారసురాళ్లు!


ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ శ్రీలీల గర్వించదగిన నటి అని, ఎన్నో రకాల సినిమాలు చేస్తూ ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్ర పోషించిందని కొనియాడారు. 'భగవంత్ కేసరి' చిత్రంతో బాలయ్యతో వర్క్ చేసే అదృష్టం శ్రీలీలకు దొరికిందన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆమె పోషించిన విజ్జిపాప అనే రోల్ చాలా రోజులు గుర్తుండిపోతుందన్నారు. భగవంత్‌ కేసరి, విజ్జిపాప పాత్రల మధ్య సాగే ఎమోషనల్ జర్నీ ఆడియన్స్ ను చాలా బాగా ఆకట్టుకుందని తెలిపారు. శ్రీలీల వండర్ ఫుల్ పర్సన్ అని.. ఎంతో టాలెంట్ ఉన్న యాక్ట్రెస్ అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. 


'భగవంత్‌ కేసరి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్​కి టాలీవుడ్ యువ దర్శకులు వంశీ పైడిపల్లి, గోపీచంద్‌ మలినేని, కొల్లు బాబీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ రాంప్రసాద్‌, స్టంట్ మాస్టర్ వెంకట్‌, ఎడిటర్ తమ్మిరాజు, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్‌, నటులు జాన్‌ విజయ్‌, మురళీధర్‌, ఆనంద్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


Also Read: నేను రాసిన దానికంటే బాలయ్య 1000 రెట్లు అద్భుతంగా నటించారు: డైరెక్టర్ అనిల్‌ రావిపూడి


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial