బాలకృష్ణ తరువాతి సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు కమర్షియల్ మూవీ లవర్స్ అంతా ఎంతో ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడిలాంటి కామెడి డైరెక్టర్.. బాలకృష్ణతో కలిసి ‘భగవంత్ కేసరి’లాంటి యాక్షన్ సినిమాను ఎలా తెరకెక్కించగలరు అని సందేహిస్తున్న ప్రేక్షకులకు ట్రైలర్‌తో గట్టి సమాధానమే ఇచ్చాడు దర్శకుడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు మూవీ టీమ్ అంతా హాజరయ్యింది. ఇక ఈ ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ ఉపయోగించిన ఒక పదం.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


లోపల ఇంకా దాచిపెట్టాం..
వరంగల్ లాంటి ప్రాంతంలో ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయడంతో అక్కడి పోరాట యోధులను గుర్తుచేసుకుంటూ బాలకృష్ణ తన స్పీచ్‌ను ప్రారంభించారు. తెలంగాణ మాండలికంలో మాట్లాడడం తన కెరీర్‌లో మొదటిసారని అన్నారు. ఈ ఈవెంట్‌లో సినిమా గురించి మాత్రమే కాకుండా అనేక ఇతర విషయాల గురించి కూడా మాట్లాడారు బాలయ్య. ఆయన భక్తి ఎక్కువ అని బయటపెట్టారు. ట్రైలర్‌లో చూసింది కొంచమే, లోపల ఇంకా దాచిపెట్టాం అని అన్నారు. సినిమా రిలీజ్ కి ముందు మీకు సినిమా నుంచి ఇంకో సర్‌ప్రైజ్ ఇస్తాను అంటూ ఫ్యాన్స్‌లో మరింత హైప్‌ను క్రియేట్ చేశారు. ఆ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడిని ప్రశంసించారు. ఆ తర్వాత శ్రీలీలతో కలిసి నటించడం గురించి మాట్లాడారు.


మోక్షజ్ఞ అలా అన్నాడు..
‘భగవంత్ కేసరి’ చిత్రంలో శ్రీలీల.. బాలయ్యకు కూతురి పాత్ర చేసింది. అయితే ఆ మూవీ షూటింగ్ జరిగినంత వరకు శ్రీలీల తనను చీచా అని పిలిచిందని గుర్తుచేసుకున్నారు. అయితే తరువాతి సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించాలని ఉందని బయటపెట్టారు. ఇదే విషయాన్ని ఇంటికి వెళ్లి తన వాళ్లతో పంచుకున్నానని, అప్పుడు తన కొడుకు మోక్షజ్ఞ కోపడ్డాడని, త్వరలోనే శ్రీలీలతో తను హీరోగా లాంచ్ అవుతుండగా.. బాలయ్య ఇలా అనడంతో సీరియస్ అయ్యాడని అన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అంటూ తన కొడుకు తిట్టాడని బాలయ్య బయటపెట్టారు. అయితే స్టేజ్‌పైనే బాలయ్య ఈ మాట మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచినా.. బాలయ్య మనస్థత్వం తెలిసినవారు మాత్రం లైట్ తీసుకున్నారు.


ప్రభుత్వాలు సహకరించలేదు..
తన అభిమానుల గురించి కూడా బాలయ్య మాట్లాడారు. అలాంటి అభిమానులు దొరకడం తన అదృష్టమని అన్నారు. ‘భగవంత్ కేసరి’ చూసిన తర్వాత ఆడవారు మాత్రమే కాదు.. మగవారు కూడా ఏడుస్తారని సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. అఖండ సినిమా సమయంలో ప్రభుత్వాలు సహకరించలేదని గుర్తుచేసుకున్నారు. ఎక్స్ ట్రా షోలు లేవు, రేట్లు పెంచలేదని అన్నారు. సినిమాలకు ప్రభుత్వాలు సహకరించాలని, సినిమాల నుంచి ఆదాయం వస్తుందని అన్నారు. అలాగే మధ్య మధ్యలో డైలాగ్స్, ఎన్టీఆర్ గురించి, తెలంగాణ గురించి, ఇక్కడి ప్రముఖుల గురించి కూడా మాట్లాడారు బాలయ్య. ఇది కేవలం తన సినిమా ఈవెంట్ కాబట్టి ఇందులో రాజకీయం గురించి ఎక్కువగా మాట్లాడకూడదని బాలయ్య నిర్ణయించుకున్నారని ఆయన స్పీచ్ చూస్తుంటే అర్థమవుతోంది.


Also Read: ‘బ్రో... ఐ డోంట్ కేర్’ - బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ చూశారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial