సినీ పరిశ్రమలోని కొందరు కమెడియన్స్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా కామెడీ చేసి ప్రేక్షకులను నవ్విస్తుంటారు. కొందరు కమెడియన్స్‌కు ఇతరుల నవ్వించే గుణం చాలా నేచురల్‌గా వచ్చేస్తుంది. టాలీవుడ్‌లోని అలాంటి కమెడియన్స్‌లో బ్రహ్మాజీ కూడా ఒకరు. ఆయన కమెడియన్‌గా నవ్వించడం మాత్రమే కాదు.. సీరియస్ పాత్రలతో ఏడిపించారు కూడా. కానీ బయట మాత్రం బ్రహ్మాజీ చాలా సరదాగా ఉంటారు. ఇతరులపై పంచులు వేయడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకుంటూ ఉంటారు. తాజాగా నవీన్ పోలిశెట్టిపై కూడా అలాంటి ఒక పంచ్ వేశారు బ్రహ్మాజీ. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఒక ఫన్నీ సంభాషణే జరిగింది.


నవీన్ ట్వీట్‌కు బ్రహ్మాజీ రియాక్షన్..
ఎన్ని సంవత్సరాలకు ఒక సినిమా తీశామన్నది కాదు.. కంటెంట్ ఉన్న మూవీతో వచ్చి హిట్ కొట్టామా లేదా అన్నట్టుగా ఉంది నవీన్ పోలిశెట్టి పరిస్థితి. సైలెంట్‌గా వచ్చేస్తాడు. సినిమాలకు కష్టపడి ప్రమోషన్స్ చేసుకుంటాడు. హిట్ కొట్టేస్తాడు. అంతే సింపుల్. ఇక ఇటీవల నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. ఇందులో స్టాండప్ కమెడియన్‌గా నవీన్ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. స్టాండప్ కమెడియన్‌గా తన బాడీ లాంగ్వేజ్, మాటలు చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఇక థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా.. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. ఈ విషయాన్ని నవీన్.. ట్విటర్‌లో పోస్ట్ చేయగా.. దానికి బ్రహ్మాజీ కౌంటర్ ఇచ్చారు.


రిటైర్ అయిపోతే బెటర్..
‘ఇంజనీర్స్ అసెంబుల్. అదే కదా అండి ప్రాసెస్.’ అంటూ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ నుండి ఒక వీడియోను విడుదల చేస్తూ ఆ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యిందని ప్రకటించాడు నవీన్ పోలిశెట్టి. ఈ ట్వీట్‌కు బ్రహ్మాజీ రిప్లై ఇచ్చారు. ‘ఈ అబ్బాయి టాలెంట్ చూస్తే నాకు భయమేస్తుంది. నేను రిటైర్ అయిపోతే బెటర్.’ అంటూ వ్యంగ్యంగా చెప్పారు బ్రహ్మాజీ. దానికి నవీన్ రిప్లై ఇచ్చాడు. ‘మీకు పవర్ ఉంది. మాకు బ్రెయిన్ ఉంది. మనిద్దరం కలిస్తే..’ అంటూ ‘జాతిరత్నాలు’ డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చాడు. దానికి బ్రహ్మాజీ.. ‘అంటే నాకు..’ అని రిప్లై ఇచ్చారు. అలా కాసేపు వీరిద్దరి మధ్య ‘జాతిరత్నాలు’ సంభాషణ నడిచింది.






ఇండియాలో మాత్రమే కాదు.. ఓవర్సీస్‌లో కూడా..
నవీన్ పోలిశెట్టి, బ్రహ్మాజీ.. ఇద్దరూ కామెడీ టైమింగ్‌లో తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. ఇప్పటికే వీరిద్దరు ‘జాతిరత్నాలు’ చిత్రంలో కలిసి నటించారు. ఇందులో వీరిద్దరి మధ్య ఉండే సీన్స్ తక్కువే అయినా అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఆ మూవీ తర్వాత పూర్తిగా దానికి భిన్నమైన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కథతో ముందుకొచ్చాడు నవీన్. ఈ మూవీ కోసం అనుష్కలాంటి సీనియర్ హీరోయిన్‌తో జతకట్టాడు. సినిమాలో వీరిద్దరి పెయిర్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా టాప్ 10లో నిలిచింది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. మూవీ ప్రమోషన్స్ విషయంలో నవీన్ చాలా కష్టపడినా.. ప్రేక్షకుల మౌత్ టాక్ వల్లే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. కేవలం ఇండియాలోనే కాదు ఓవర్సీస్‌లో రికార్డ్ స్థాయి కలెక్షన్స్‌ను సాధించింది. 


Also Read: దోచుకున్న డబ్బును ఫ్యామిలీకి ఇవ్వలేదా? నాగేశ్వర రావు కుటుంబం పరిస్థితి ఇప్పుడెలా ఉంది?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial