Top 5 Telugu Headlines Today 06 September 2023: 
రెండు, మూడు రోజుల్లో నన్నూ అరెస్ట్ చేస్తారు - చంద్రబాబు ఆరోపణలు !
నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ అరాచక పాలన అంతం కోసం ఇంటికొకరు తనతో పాటు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. తనపై కూడా దాడి చేస్తారని అన్నారు. ఎన్ని చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. మహాభారతం, రామాయణంలో ధర్మం గెలిచినట్టు చివరకు మనమే గెలుస్తామని అన్నారు. గతంలో ఎప్పుడూ రాని మెజార్టీ ఈ ఎన్నికల్లో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు


నేడు మరోసారి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ
అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌ ప్టారీ. వీలైంత త్వరగా క్యాండిడేట్లను ప్రకటించాలని భావిస్తోంది. అయితే... ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో... తీవ్రంగా కసరత్తు చేయాల్సి వస్తోంది. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎమెల్యే అభ్యర్ధులను ఎంపిక చేయాలని స్క్రీనింగ్ కమిటీకి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సభ్యులు. ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ నిర్దేశించినట్టు కాకుండా బీసీలకు, మహిళలకు అత్యధిక సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు. పూర్తి వివరాలు


వైజాగ్‌ పోలీస్ కమిషనరేట్ పరిధి పెంపులో ఇంత ప్లానింగ్ ఉందా!- ఆ ప్రక్రియకు డేట్‌ ఫిక్స్ అయినట్టేనా!
విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...వేగంగా అడుగులు వేస్తున్నారు. వచ్చే నెల 2వ తేదీ లేదా 24న...సీఎం క్యాంప్ కార్యాలయాన్ని వైజాగ్ కు మారుస్తారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయ్. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నుంచే పాలన సాగనుండటంతో...విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ హోదా పెంచాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలుస్తోంది. ఇందులో భాగంగా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిని అడిషనల్ డీ జీ ర్యాంక్ కు పెంచింది.  కొత్త నగర పోలీస్ కమిషనర్ గా 1994 బ్యాచ్ కు చెందిన రవిశంకర్ అయ్యన్నార్ ని నియమించింది. పూర్తి వివరాలు 


పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నేడు కేసీఆర్‌ సమీక్ష-నెలాఖరులోగా ప్రాజెక్టు ప్రారంభించే అవకాశం
పాలమూరు-రంగారెడ్డి... భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు. వలసల జిల్లాగా పేరుపొందిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాకు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు  అందించాలనే లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు పనులపై ఇవాళ సీఎం కేసీఆర్‌ ఫోకస్‌ పెట్టారు. ప్రాజెక్టు  నిర్మాణ పనులపై ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాలకు అడ్డంకిగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి నిర్మాణ  పనులు గడువులోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టనున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో ఇవాళ సీఎం కేసీఆర్‌ అధ్యక్షత జరగనున్న ఉన్నతస్థాయి  సమీక్షా సమావేశం పూర్తి వివరాలు

చంద్రబాబుకు వచ్చిన ఐటీ నోటీసులపై స్పందించరేం? మంత్రి కాకాణి గోవర్దన్ ప్రశ్నలు
ఏపీ, తెలంగాణలో ఎవరి ప్రాధాన్యాలు వారికి ఉంటాయని, రెండురాష్ట్రాలను పోల్చి చెబుతూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని మీడియాపై మండిపడ్డారు మంత్రి కాకాణి. వ్యవసాయ యాంత్రీకరణపై తప్పుడు రాతలు రాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ వార్తలు అర్థరహితం అన్నారు కాకాణి. ఏపీలో వ్యవసాయాన్ని పట్టించుకోవట్లేదని, విత్తనాల సరఫరాపై ప్రభుత్వం దృష్టిపెట్టట్లేదని వచ్చిన కథనాలను మంత్రి కాకాణి ఖండించారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రైతులు సంతోషంగా ఉంటున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వం రైతులకు చేసిన మేలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయట్లేదని చెప్పారు.  పూర్తి వివరాలు