Chandrababu On Arrest : నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ అరాచక పాలన అంతం కోసం ఇంటికొకరు తనతో పాటు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. తనపై కూడా దాడి చేస్తారని అన్నారు. ఎన్ని చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. మహాభారతం, రామాయణంలో ధర్మం గెలిచినట్టు చివరకు మనమే గెలుస్తామని అన్నారు. గతంలో ఎప్పుడూ రాని మెజార్టీ ఈ ఎన్నికల్లో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పల్లె ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


తనపైనే దాడి చేసి.. తనపైనే హత్యాయత్నం కేసులు పెట్టారన్న చంద్రబాబు          


రైతులకు కూడా చెప్పకుండా భూముల్లో కాలువలు తవ్వుతున్నారని..  తప్పులను ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని అయినా చేశారా?  అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని  అంగళ్లు, పుంగనూరులో వైసీపీ నాయకులు నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు.  హత్యాయత్నం చేసి తిరిగి తనపైనే కేసులు పెట్టారని..  - నేను చెబితేనే దాడులు చేసినట్లు ఒత్తిడి చేస్తూ స్టేట్మెంట్ రాయిస్తున్నారని ఆరోపించారు.  - ఎన్‍ఎస్‍జీ భద్రత ఉన్న నాపై వైసీపీ నేతలు రాళ్లదాడి చేశారన్నారు.  తనపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని విమర్శించారు. 


యువగళంపై దాడులు చేసి రివర్స్ కేసులు పెట్టారు ! 


కుప్పంలో పోటీ చేసేది నేను అని చెప్పుకోవాలా?  ప్రజాసమస్యలపై మాట్లాడితే రౌడీలతో దాడులు చేస్తున్నారని..  వేకాను హత్య చేసి మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని రాస్తారని మండిపడ్డారు.  - అనేక రకాలుగా అపవాదులు వేశారు.. రివర్స్ లో కేసులు పెడుతున్నారు -  యువగళంకు వచ్చి దాడులు చేసి.. వాళ్లపైనే కేసులు పెడుతున్నారని  విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పెట్టి రివర్స్ పాలనకు తెరతీశారున్నారు.  జగన్ రెడ్డికి బటన్ నొక్కడం ఒక్కటే తెలుసని..  ప్రజలకు ఇచ్చిన డబ్బులు కంటే పేపర్ ప్రకటనలకు ఎక్కువ ఇచ్చారన్నారు. తాను ష్యూరిటీ ఇస్తున్న పేదలను ధనవంతులుగా మారుస్తానని చంద్రబాబు హామీై ఇచ్చారు. 


అరాచక పాలన అంతానికి ఇంటికొకరు రావాలి !                               


కురుక్షేత్రం, రామాయణంలో ధర్మం గెలిచినట్లు మనం గెలుస్తున్నాం  అరాచక పాలన అంతం కోసం ఇంటికి ఒకరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పుంగళూరు, అంగళ్లు ఘటనల్లో చంద్రబాబుపై ఏ వన్ గా కేసు నమోదు చేశారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ తెచ్చుకోలేదు. ఇతర  నిందితులు తెచ్చుకున్నారు. అయితే ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ కేసులోనే చంద్రబాబును అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. తనకు సమాచారం ఉండటంతోనే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.