Sanatan Dharma Row: 



ఉదయనిధి స్టాలిన్‌పై కేసు..


సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి  స్టాలిన్‌పై కేసు నమోదైంది. ఆయన వ్యాఖ్యల్ని సమర్థించిన కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేపైనా కేసు నమోదు చేశారు. మతాన్ని కించపరిచినందుకు, మనోభావాలు దెబ్బ తీసినందుకు యూపీలోని రామ్‌పూర్‌లో కేసులు నమోదయ్యాయి. లాయర్లు హర్ష్ గుప్త, రామ్ సింగ్ లోధి వీరిద్దరిపై ఫిర్యాదు చేశారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కంప్లెయింట్ ఇచ్చారు. తమ మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడారని అన్నారు. ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గే...ఈ ఇద్దరు నేతలూ I.N.D.I.A కూటమిలో ఉన్న వాళ్లే. అందుకే రాజకీయంగానూ ఇది దుమారం రేపింది. స్టాలిన్ వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ తీవ్ర స్థాయిలో మండి పడింది. కేంద్రహోంమంత్రి అమిత్‌ షా కూడా స్టాలిన్‌పై మండి పడ్డారు. ఇలాంటి కామెంట్స్ చేయడం వాళ్లకు ఇదేం మొదటి సారి కాదని విమర్శించారు.