పోలవరంలో సీఎం జగన్ టూర్- పనుల జరుగుతున్న తీరుపై ఏరియల్ సర్వే
పోలవరం ప్రాజెక్ట్‌ ప్రాంతంలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రాజెక్టు ఏరియాకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఏరియల్‌ సర్వే చేపట్టారు. ఏరియల్‌ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలించారు. రెండుసార్లు ప్రాజెక్టు ప్రాంతంలో హెలికాప్టర్‌లో తిరిగిన సీఎం జగన్‌ పనులు తీరును పరిశీలించారు. గతం కంటే భిన్నంగా ఏం జరిగిందనే విషయంపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. 


పోలవరం ప్రాజెక్టులో చిన్న చిన్న సమస్యలను కూడా విపత్తులా చూపిస్తున్నారని మీడియాపై విమర్శలు చేశారు జగన్. గత ప్రభుత్వం ఎగువ కాఫర్ డ్యామ్‌లో ఖాలీలు వదిలేశారని దీని వల్ల చాలా నష్టం వాటిల్లిందన్నారు. దీని వల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడమే కాకుండా రెండు వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఇలాంటివి ఓ వర్గం మీడియాకు కనిపించడం లేదని విమర్శించారు. ప్రాజెక్ట్‌ స్ట్రక్చర్‌కు సంబంధం లేని గైడ్‌వాల్‌ కుంగితే దాన్నో పెద్ద సమస్యగా చిత్రీకరించారన్నారు. పూర్తి వివరాలు


కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- ఈ నెలలోనే జాయినింగ్స్!
ఇన్నాళ్లూ కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. వివిధ వర్గాలు, స్నేహితులు, అభిమానులతో చర్చల అనంతరం ఈ ఇద్దరి నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ పార్టీపై పాజిటివ్‌ ధోరణితో నేతలు ఉన్నట్టు అర్థమవుతోంది. తమతోపాటు తమ అనుచరలకు టికెట్లు కేటాయిస్తే చేరేందుకు సిద్ధమని కాంగ్రెస్ అధిష్ఠానంతో చాలా రోజులుగా ఈ ఇద్దరి నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ విషయంపై సుదీర్ఘ మంతనాలు జరిపిన కాంగ్రెస్ అధినాయకత్వం ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.  పూర్తి వివరాలు


అన్ని పార్టీలతో స్నేహమంటే సొంతంగా ఎదిగే స్కోప్ ఏదీ? ఏపీ బీజేపీలో అంతర్మథనం
ఆంధ్రప్రదేశ్‌లో పుంజుకోవటం అంటే పక్క పార్టీలను కలుపుకోవటమా.. ఈ మాటలు ఇప్పుడు కాషాయ దళాన్ని ఇరకాటంలోకి నెడుతున్నాయి. పార్టీని బలోపేతం చేయటం అటుంచితే, మిగిలిన పార్టీలతో దోస్తి ఎంత వరకు లాభిస్తుందనేది కమలదళాన్ని గందరగోళానికి గురి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని పదే పదే భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి ప్రకటనలు వస్తుంటాయి. అవి విన్న కిందిస్థాయి శ్రేణులు ఏదో జరిగిపోతుందని ఆశలు పెట్టుకోవడం సర్వసాధారణం. ఆ తరువాత వాటిని గురించి పట్టించుకునే నాథుడు లేకపోవటంతో ఎప్పుడూ జరిగేదే. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ మళ్లీ వ్యూహాలు చిస్తోంది అధినాయకత్వం.  పూర్తి వివరాలు


పోస్టింగ్‌ల పేరుతో హోంశాఖ సెక్రటరీ సంతకం ఫోర్జరీ
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు దేవానందర్, ఆయన కుమారుడు సాయి దేవానంద్ లపై తీవ్రమైన అభియోగాలతో ఢిల్లీలో కేసులు నమోదయినట్లుగా తెలుస్ోతంది.  కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సంతకాలను వీరు ఫోర్జరీ చేసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వద్ద ఓఎస్డీలుగా నియమిస్తున్నట్లుగా కొంత మందికి ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇలా అపాయింట్ మెంట్ లెటర్లు తీసుకున్న వారి వద్ద లక్షలు వసూలు చేశారు. ఆ బ్యాంక్ స్టేట్ మెంట్లు, వాట్సాప్ చాట్స్ అన్నీ బయటకు రావడంతో ఈ అంశం ఏపీ బీజేపీలోనూ కలకలం రేపుతోంది.  పూర్తి వివరాలు 


పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం
పోలవరం ప్రాజెక్టుకుపై కేంద్రం మరో శుభవార్త చెప్పింది. 12,911.15 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడానికి ఓకే చెప్పింది. విభాగాల వారీగా పెట్టే పరిమితులను తొలగించింది. ఇప్పుడు ఇచ్చిన నిధులు ఎక్కడైనా ఖర్చు పెట్టుకోవచ్చు. 2013–14 ధరల ప్రకారం చూస్తే ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లే అవుతుంది. కానీ కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పునారావాసానికే భారీ ఖర్చు అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తోంది. అందుకే తాజా రేట్ల ప్రకారమే నిధులు ఇవ్వాలని కోరుతూ వచ్చింది. అలా చేయకుంటే ప్రాజెక్టు నిర్మాణం సాధ్యపడదని కూడా రాష్ట్ర ప్రభుత్వాధికారులు కేంద్రానికి నివేదికలు ఇచ్చారు. పూర్తి వివరాలు