Case On AP BJP Leader Devanan :   ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు దేవానందర్, ఆయన కుమారుడు సాయి దేవానంద్ లపై తీవ్రమైన అభియోగాలతో ఢిల్లీలో కేసులు నమోదయింది.   కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సంతకాలను వీరు ఫోర్జరీ చేసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వద్ద ఓఎస్డీలుగా నియమిస్తున్నట్లుగా కొంత మందికి ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చారు.   ఇలా అపాయింట్ మెంట్ లెటర్లు తీసుకున్న వారి వద్ద లక్షలు వసూలు చేశారు. ఆ బ్యాంక్ స్టేట్ మెంట్లు, వాట్సాప్ చాట్స్ అన్నీ బయటకు రావడంతో ఈ అంశం ఏపీ బీజేపీలోనూ కలకలం రేపుతోంది.


అజయ్ భల్లా సంతకాన్ని ఫోర్జరీ చేసి నకలీ అపాయింట్‌మెంట్ లెటర్ 
 
కొద్ది రోజుల కిందట కిషన్ రెడ్డి ఆఫీసుకు వెళ్లి ఓ మహిళ తనను ఓఎస్డీగా నియమించారని అపాయింట్ మెంట్ లెటర్ కార్యాలయంలో చూపించింది. అయితే అలాంటి సమాచారం ఏమీ తమకు లేకపోవడంతో  కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఆఫీసు సిబ్బంది. తర్వాత వివరాలు వెరిఫై చేయడంతో   ఫేక్ లెటర్. ఆ మహిళను ఓ బీజేపీ నేత మోసం చేసి.. అజయ్ భల్లా సంతకం ఫోర్జరీ చేసి మరీ అపాయింట్ మెంట్ లెటర్ సృష్టించారని తేలింది. ఆ మహిళ వద్ద నుంచి వివరాలు బయటకున్న  కేంద్ర మంత్రి సిబ్బంది.. అ అపాయింట్‌మెంట్ లెటర్‌ను  ఏపీ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్. అతని కుమారుడు సాయి దేవానంద్ తయారు చేసి ఇచ్చినట్లుగా గుర్తించారు. వెంటనే  ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో   కిషన్ రెడ్డి కార్యాలయం ఫిర్యాదు  చేసింది. కిషన్ రెడ్డి కార్యాలయం అధికారి ప్రణవ్ మహాజన్  ఏప్రిల్ 27న ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన  పై 468, 471 ఐపిసి సెక్షన్ ల కింద కేస్ నమోదు  అయింది. 


బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిపై ఢిల్లీలో కేసులు 


దేవానంద్, సాయి దేవానంద్ ఇలా..  ఎంత మంది అధికారుల పేర్లను ఫోర్జరీ చేశాలో దర్యాప్తులో తేలాల్సి ఉంది.  తన సంతకాన్నే ఫోర్జరీ చేయడంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సిబ్బంది  ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో ఉండే సీబీఐ కూడా కేసు వివరాలు సహకరిస్తుంది . కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్‌లో మోసపోయిన బాధితురాలితో మాట్లాడి..ఇంకా ఎంత మందిని మోసం చేశారో వివరాలు బయటకు లాగుతున్నారు. రాష్ట్ర పోలీసుల నుంచి దేవానంద్‌పై ఉన్న ఇతర కేసుల వివరాలను సేకరిస్తున్నారు.  కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సిబ్బంది  ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో ఉండే సీబీఐ కూడా కేసు వివరాలు సహకరిస్తుంది . కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్‌లో మోసపోయిన బాధితురాలితో మాట్లాడి..ఇంకా ఎంత మందిని మోసం చేశారో వివరాలు బయటకు లాగుతున్నారు. రాష్ట్ర పోలీసుల నుంచి దేవానంద్‌పై ఉన్న ఇతర కేసుల వివరాలను సేకరిస్తున్నారని చెబుతున్నారు.


వాట్సాప్ చాట్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్లు రిలీజ్  చేసిన బాధితులు


మోసం చేసిన మహిళ వద్ద నుంచి ఆయనకు ఉన్న పెట్రోల్ బంకు సంస్థ ఖాతాలోకి లక్షల రూపాయల నగదు బదిలీ చేయించుకున్న బ్యాంక్ స్టేట్‌మెంట్లను బాధితులు విడుదల చేశారు. అలాగే దేవానంద్ కుమారుడితో చేసిన వాట్సాప్ చాట్స్ కూడా విడుదల చేశారు.  దేవానంద్  తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన నేత.   2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత రెండు నెలలకే బీజేపీలో చేరారు.  ఆయనకు ఎస్సీ మోర్చా అధ్యక్ష పదవి లభించింది. అయితే ప్రముఖులతో  ఫోటోలు దిగి ఇలా కేంద్రం వద్ద పలుకుబడి ఉందని పనులు చేయిస్తామని.. పోస్టింగ్‌లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తారన్న ఆరోపణలు కొంత కాలంగా ఉన్నాయి. తాజాగా కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది.


   
బీజేపీ చర్యలు తీసుకుంటుందా ?


బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మోర్చా అధ్యక్ర్షడు దేవానంద్ ఏకంగా హోంశాఖ సెక్రటరీ అజయ్  భల్లా సంతకాన్ని ఫోర్జరీ చేయడం సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారం బీజేపీ వర్గాల్లో అంతర్గతంగా తీవ్ర చర్చకు దారి తస్తోంది.  ఈ అంశం గురించి తాజాగా వెలుగులోకి రావడంతో ...  దేవానంద్ లీలలపై ఆ పార్టీ నేతలు సమాచారం సేకరించి హైకమాండ్‌కు పంపుతున్నట్లుగా చెుతున్నారు.   ఇది చిన్న నేరం కాదని.. సీరియస్ అంశమని.. బీజేపీ పెద్దలు ఇలాంటి విషాయలను అసలు సహించరని అంటున్నారు.