వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీకి సమాన దూరం- ఏపీ బీజేపీ కేడర్‌కు క్లారిటీ ఇచ్చినట్టేనా!
దేశంలో ఉన్న రాజకీయం మొత్తం ఒకలా ఉంటే ఏపీలో మాత్రం చాలా భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ గెలిచినా బీజేపీ గెలిచినట్టే.... స్టేట్‌ బీజేపీలో ఉంది మాత్రం టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులే అనే విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. దీన్ని రుజువు చేసేలానే ఉంటున్నాయి అక్కడి పార్టీల వ్యూహాలు, నేతల మాటలు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా బీజేపీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం ఉంది. కేంద్రమంత్రులు, అగ్రనేతలు వచ్చి వెళ్తున్నా పార్టీలో ఆ జోష్ కనిపించలేదు. సోమువీర్రాజు తీసుకున్న నిర్ణయాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో ఆయనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయనపై నేరుగా ఫిర్యాదులు కూడా అధినాయకత్వానికి అందాయి.  పూర్తి వివరాలు   


హిందూపురం వైఎస్ఆర్‌సీపీ ఇంచార్జ్ గా దీపికారెడ్డి - బాలకృష్ణకు సవాల్ విసరగలరా ?
హిందూపురం వైఎస్ఆర్‌సీపీ ఇంచార్జ్ గా దీపికా రెడ్డి నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.  హిందూపురం నియోజకవర్గంలో  తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత మరో పార్టీ విజయం సాధించలేదు. ఈ సారి అక్కడ విజయం సాధించాలన్న లక్ష్యంతో  వైఎస్ఆర్‌సీపీ కొత్త నేతను ఎంపిక చేసుకున్నట్లుగా కనిపస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ ల సమీక్షా సమావేశానికి.. ఎమ్మెల్సీ, ఇంచార్జ్ గా ఉన్న ఇక్బాల్ కు ఆహ్వానం ఇవ్వలేదు. దీపికా రెడ్డినేపిలిచారు. తాజాగా ఆమెకు ఇంచార్జ్ పదవిని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో హై ప్రోఫైల్ నియోజకవర్గాల్లో  హిందూపురం ఒకటి.  టీడీపీ ఆవిర్భవించిన తర్వాత మరో పార్టీ అక్కడ గెలవలేదు . అందుకే ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా అక్కడి నుంచే పోటీ చేస్తూంటారు.  పూర్తి వివరాలు


సర్పంచ్ నవ్య కేసులో ట్విస్ట్ - నిజనిజాలేంటో తేల్చేసిన పోలీసులు!
ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య మధ్య ఏర్పడిన వివాదంలో పోలీసులు నిజానిజాలేమిటో తేల్చారు.  నవ్య ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు  జాతీయ మహిళా కమిషన్‌కు నివేదిక సమర్పించారు. రెండు పర్యాయాలు నోటీసులు ఇచ్చినా పోలీసులకు   సర్పంచ్ నవ్య ఆధారాలూ సమర్పించలేదన్నారు.  నిర్ణీత సమయానికి ఆధారాలు సమర్పించని నేపథ్యంలో కేసు క్లోజ్ చేయవచ్చని పోలీసులకు నవ్య తెలిపారని కూడా వివరించారు. దీంతో ఆ కేసును పోలీసులు క్లోజ్ చేస్తున్నట్లయింది.    పూర్తి వివరాలు


సైలెంట్‌ మోడ్‌లో తెలంగాణ బీజేపీ- అధినాయకత్వం నిర్ణయంపై అసంతృప్తి- కిషన్ రెడ్డి రాజీనామా!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను దించేసిన అధినాయకత్వం కిషన్‌ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. దీనిపై ఆయన ఇంత వరకు స్పందించలేదు. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న ఆయన కేబినెట్‌ మీటింగ్‌కి కూడా హాజరుకాలేదు. ఆయన రాజీనామా చేశారని కొందరు, చేయబోతున్నారని మరికొందరు చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు అందర్నీ షాక్‌కి గురి చేసింది. బండి సంజయ్‌ను తప్పిస్తారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ పుకార్లు అంటూ కేంద్ర అగ్రనాయకుల నుంచి రాష్ట్ర నాయకుల వరకు అంతా ఖండించారు. బండి సంజయ్‌ ఆధ్వర్యంలోనే ఎన్నికలను పేస్ చేయబోతున్నట్టు పదే పదే చెబుతూ వచ్చారు.  పూర్తి వివరాలు 


ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ డిస్మిస్ - వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం !
 వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను అనుమానితుడిగా కాకుండా బాధితుడిగా గుర్తించాలని సుప్రీంకోర్టులో  ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. వైఎస్  వివేకా చనిపోయినట్లుగా తాను మొదట చూసి ఫిర్యాదు చేశానని..  మొదటి  పిర్యాదు దారుడ్ని తానే కాబట్టి తనను బాధితుడిగా చూడాలని ఎంవీ కృష్ణారెడ్డి కోరారు. అియతే ఆయనను సీబీఐ ఇటీవల అనుమానితునిగా చేరుస్తూ చార్జిషీట్ దాఖలు చేసింది. ఎంవీ కృష్ణారెడ్డి వివేకానందరెడ్డి చనిపోయే వరకూ పీఏగా ఉన్నారు.  పూర్తి వివరాలు 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial