ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి నెలాఖరు వరకు డెడ్ లైన్ పెట్టాయి. ఈలోగా పీఆర్సీ సహా తమ సమస్యలన్నీ పరిష్కరించాల్సిందేనని లేకపోతే పోరుబాట పడతామని ప్రకటించారు. శుక్రవారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీ నివేదిక ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఉద్యోగ సంఘాలు శనివారం ఉదయం సమావేశమై నెలాఖరు వరకు ప్రభుత్వానకి గడువు ఇవ్వాలని నిర్ణయించారు.
Also Read : 662 శాతం లోటు ! పతనం అంచున ఏపీ ఆర్థిక వ్యవస్థ ?
పే రివిజన్ కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి చేరి మూడేళ్లయినప్పటికీ తమకు రిపోర్ట్ ఇవ్వడానికి కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఉద్యోగ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 నెలల తర్వాత అధికారుల కమిటీని నియమించి అధ్యయనం చేస్తోందని చెబుతున్నారని కమిటీలన్నీ కాలయాపనకే తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏపీజేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. హెల్త్ కార్డు అనారోగ్య కార్డుగా మారిందని.. కనీసం రీయింబర్స్‌మెంట్ కింద ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేస్తున్న డబ్బులను కూడా ఇవ్వడం లేదని.. "మా డబ్బులు మాకు ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేవా" అని ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి చాలా ఆశగా ఉన్నామని, ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లన్నీ పరిష్కారం అవుతాయని భావించామని కానీ నిరాశే ఎదురైందన్నారు. ఉద్యోగుల ఓట్లు అక్కర్లేదా అని ఆయన సీఎం జగన్‌ను ప్రశ్నించారు. మూడేళ్లలో ఉద్యోగుల సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని ఉద్యోగ సంఘం నేతలు స్పష్టం చేశారు.
Also Read: రూ. 25వేల కోట్ల బకాయిలు డిస్కంలకు చెల్లించండి.. ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ లేఖ !
సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని పూర్తిగా మరిచిపోయారని .. మంత్రుల కమిటీ, అధికారుల కమిటీ అంటూ సరిపెట్టి నివేదకలు మాత్రం ఇవ్వలేదని నేతలు విమర్శించారు. విమర్శించారు. ఒక్కరోజు ఆలస్యం లేకుండా పీఆర్సీ ఇస్తామని చెప్పి కమిటీ నివేదికలోనూ ఆలస్యం చేస్తూ వచ్చారని ఆరోపించారు. ఉద్యోగల సంఘాల ఉమ్మడి సమావేశాల అనంతరం సీఎస్‌కు మెమోరాండం ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
Also Read: పీఆర్సీ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కావడం లేదు.. అమలు చేస్తారా? లేదా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి