హైదరాబాద్‌లోని పంజాగుట్టలో నాలుగేళ్ల చిన్నారి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఈ హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ నెల 4న పంజాగుట్టలోని ఓ దుకాణం ముందు బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బాలిక శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆమె మృతిపై అనేక అనుమానాలు తలెత్తాయి. బాలిక మృత దేహాన్ని గుర్తు తెలియని ఓ మహిళ వదిలేసి వెళ్లినట్లుగా పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఎక్కడో చంపి మృతదేహాన్ని ఆ ప్రాంతంలో వదిలి వెళ్లినట్లుగా గుర్తించారు. ఇప్పటికే నిందితులను గుర్తించిన పోలీసులు వారు వెళ్లిన దారిలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలంచారు. నిందితుల కోసం నాలుగు పోలీస్‌, మూడు టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో గాలించారు.  


Also Read: మటన్ కత్తితో ఫ్రెండ్ గొంతు కోసేసి హత్య.. కారణం తెలిసి అవాక్కైన స్థానికులు


రాజస్థాన్ లో నిందితులు


రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరిన్నీ వివరాలను పోలీసులు శనివారం వెల్లడించనున్నారు. బాలిక తల్లే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధం కారణంగా ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ద్వారకాపురికాలనీలో ఒక దుకాణం ముందు ఎనిమిది రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో చిన్నారి మృతదేహం పోలీసులకు కనిపించింది. అప్పటి నుంచి హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి కొంత దూరంలో దొరికిన ఆధారాలతో నిందితులను గుర్తించారు. 


Also Read: మావోయిస్టు ఆర్కే జీవిత విషయాలు ప్రింటింగ్... నవ్య ప్రింటింగ్ ప్రెస్ లో పోలీసులు సోదాలు


హత్యకు వివాహేతర సంబంధం కారణం..!


ఈ కేసుకు సంబంధించి ముందుగా ఎలాంటి వివరాలు లభించపోవడంతో పోలీసులు ఒక ప్రకటన రూపొందించి తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్రలకు పంపించారు. సోషల్ మీడియాలోనూ చిన్నారి ఫొటోను పోస్ట్‌ చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించగా బుధవారం రాత్రి ఓ కీలకాధారం పోలీసులకు లభించింది. నిందితులు అజ్మీర్‌లో ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పాతబస్తీకి చెందిన వారుగా గుర్తించారు. బాలిక తండ్రి చనిపోవడంతో తల్లి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని, వారంతా యాచకులని పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి.


Also Read:  పంజాగుట్ట బాలిక మిస్టరీ కేసులో స్పష్టత, చనిపోయింది అందుకే.. కానీ,


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి