జీఏడీ ప్రిన్సిపాల్ సెక్రటరీ శశిభూషణ్ తో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం అయ్యారు. పీఆర్సీపై చర్చించారు. 'వెంటనే పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని కోరాం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని సభ్య సంఘాల మెంబర్ షిప్ వివరాలు కూడా కోరాం. సీఎంఓ అధికారులతో పీఆర్సీ నివేదికపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. పీఆర్సీ నివేదికను ఇప్పుడే ఇవ్వలేమని శశిభూషణ్ చెప్పారు. నా చేతుల్లో ఏం లేదు.. సీఎం, సీఎస్ చేతుల్లోనే అంతా ఉందని శశిభూషణ్ స్పష్టంగా చెప్పారు. రెండు జేఏసీలు కలిసినప్పుడు వెంకట్రామిరెడ్డిని కూడా మాతో కలవాలని కోరాం. బేషజాలు పక్కన పెట్టాలని చెప్పాం. మా మీద ఏ ఆరోపణలు చేసినా మేం స్పందించాల్సిన అవసరం లేదు. మేం మా దారి తప్పం.. కలిసి రావాలని వెంకట్రామిరెడ్డిని కోరుతున్నాం. పీఆర్సీ నివేదిక ఇవ్వడానికి కూడా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోందంటే మాకు అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వమే చంద్రశేఖర్ రెడ్డికి సలహాదారు పదవి ఇచ్చింది.' అని  ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు చెప్పారు.


పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందో అర్ధం కావడం లేదు. పీఆర్సీ నివేదికను మేమూ స్టడీ చేయాలి. మా డిమాండ్లు ఆ నివేదికలో ఉందో లేదో మాకూ తెలియాలి కదా..? పీఆర్సీని వెంటనే అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా..? లేదా..?రేపటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీ గురించే ప్రధానంగా ప్రస్తావిస్తాం. వెంకట్రామిరెడ్డి కూడా మా సోదరుడే.. ఉద్యోగుల కోసమే మా ప్రయత్నం. పెద్ద జేఏసీలుగా ఉన్న మేం ఏకమై పీఆర్సీ కోసం ఉద్యమిస్తున్నాం కాబట్టి.. పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరేం విమర్శలు చేసినా మేం పట్టించుకోం. పీఆర్సీ వ్యవహరాన్ని పక్క దారి పట్టించేలా వెంకట్రామిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. వెంకట్రామిరెడ్డి ఏదో లబ్ధిని ఆశించే పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 
                                                                                                 - బొప్పరాజు, ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ 


పీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారో కానీకనీసం నివేదిక అయినా అందితే దాన్ని అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచొచ్చని ఉద్యోగ సంఘ నేతలు భావిస్తున్నారు. అయితే పీఆర్సీ నివేదిక ఇచ్చేస్తామంటూ ప్రతీ రోజు చెబుతున్నారు కానీ ఇవ్వడం లేదు.  ఉద్యోగ సంఘ నేతలు ప్రతీ రోజు సీఎస్ ఆఫీస్ దగ్గర పడిగాపులు పడటం సహజమైపోయింది. తాము ప్రతి రోజూ తిరగడమే సరిపోతుంది కానీ.. ప్రభుత్వం స్పందించడం లేదని ఉద్యోగ సంఘ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు అంటున్నారు.


Also Read: Nellore Heavy Rains: జోరు వానలో వైసీపీ ఎమ్మెల్యే అగచాట్లు.. కనీసం గొడుగు కూడా లేకుండా ఎందుకో తెలుసా?


Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి