ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబు సతీమణిపై అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై నందమూరి తారక రామారావు కుటుంబసభ్యులు మండిపడ్డారు. బాలకృష్ణ ఇంట్లో కుటుంబ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. మహిళలను ఎంతగానో గౌరవించే నందమూరి కుటుంబంలోని మహిళల పట్ల వైఎస్ఆర్‌సీపీ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. "ప్రజల తరఫున.. పార్టీ తరఫున.. నా అభిమానుల తరఫున హెచ్చరిక చేస్తున్నామని మళ్లీ ఇలాంటి నీచపు, నికృష్టపు మాటలు మాట్లాడితే సహించేది లేదన్నారు. ఆడవాళ్ల జోలికొస్తే చేతులు ముడుచుకొని కూర్చోమని.. మీరు మారకపోతే మారుస్తామని స్పష్టం చేశారు.  పార్టీ ఆఫీసుపై దాడి చేయించారు.. చంద్రబాబుపై దాడులకు యత్నించినా సంయమనంతో ఉన్నాం..  ఇకపై ఎవరు నోరు తెరిచినా ఉపేక్షించేది లేదని మండిపడ్డారు.ఆడవాళ్లను తెరపైకి తెచ్చి మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని విమర్శించారు.  రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు.  


Also Read : అనాగరికం... సాటి మనుషులపై క్రూరత్వం... నీచ సంస్కృతికి దిగజారకండి - వైసీపీ తీరుపై నాగబాబు హాట్ కామెంట్స్
 
అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చలకు బదులుగా వ్యక్తిగత అజెండాను తీసుకొచ్చారన్నారు. చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం ఎప్పుడూ చూడలేదన్నారు.  చంద్రబాబు చాలా ధైర్యంగా ఉండే మనిషన్నారు. తాము ఎప్పుడూ వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎవరిని విమర్శించలేదని గుర్తు చేశారు.  అసెంబ్లీలో ఉన్నామో.. పశువుల దొడ్డిలో ఉన్నామో అర్థం కావడం లేదని..  అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారని గుర్తు చేశారు. రాజకీయాలతో సంబంధం లేని వారిపై మాటల దాడి సరికాదు. ఏపీలో దోచుకున్న సొమ్ము ఇంట్లో దాచుకుంటున్నారు తప్ప.. అభివృద్ధి లేదు. కొత్త నీచపు సంస్కృతికి వారు తెరలేపారని.. ఈ పరిస్థితిపై వైఎస్ఆర్‌సీపీలోనూ బాధపడేవారున్నారు. 


Also Read : మా భువనేశ్వరిపై కామెంట్స్ బాధకరం .. విలువలతో పెరిగాం.. ఆ విషయంపై మేం రాజీపడే ప్రసక్తే లేదు: పురంధేశ్వరి


కుటుంబసభ్యులనురాజకీయాల్లోకి లాగడం.. అసభ్యకరంగా దూషించడం బాధాకరమని హరికృష్ణ కుమార్తె సుహాసిని వ్యాఖ్యానించారు. తెలుగువారందరూ ఈ పరిణామాలను ఖండించాలన్నారు. మహిళలకు మగవారితో సమానంగా ఆస్తిహక్కుతో పాటు ఇతర హక్కులు కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని.. ఆయన కుమార్తెనే వైఎస్ఆర్‌సీపీ నేతలు అవమనించారని ఇతర కుటుంబసభ్యులు మండిపడ్డారు. ఇంతకాలం సహించామని ఇక ఊరుకోబోమన్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలకు తల్లులు, భార్యలు, పిల్లలు ఉంటారని ... వారిని కూడా ఇలాగే అంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మహిళలపై ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తే ఇక రాజకీయాల్లోకి మహిళలు ఎవరైనా వస్తారా అని ప్రశ్నించారు. 


Also Read: AP Chandra Babu : మళ్లీ గెలిచాకే అసెంబ్లీకి వెళ్తా.. కుటుంబాన్ని అవమానించారని విలపించిన చంద్రబాబు !


చంద్రబాబు కంటే ఎక్కువ అభివృద్ది చేస్తారన్న ఉద్దేశంతో ప్రజలు ఒక్క చాన్స్ ఇచ్చారని .. రెండున్నరేళ్లలో ఏం చేశారో చెప్పాలని నందమూరి లోకేశ్వరి కుమారుడు డిమాండ్ చేశారు. అభివృద్ధి చేయలేక ఏపీని నాశనం చేస్తూ ఇలాంటి వికృతాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరింకారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకుంటున్నారన్నారు. తోబుట్టువుకు ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరూ అంజగా నిలిచారు. ప్రెస్‌మీట్‌కు ముందే నందమూరి బాలకృష్ణ ట్వీట్స్ చేశారు. ఈ అరాచకాలకు జనమే సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. మాటతో కాదు ఓటుతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. 


Also Read: Assembly Boycott : జయలలిత , ఎన్టీఆర్, జగన్.. ఇప్పుడు చంద్రబాబు ! అసెంబ్లీ బాయ్‌కాట్ సవాల్‌కు ఓ చరిత్ర..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి