దేశంలో మోడీ, రాష్టంలో కేసీఆర్ నాటకాలాడుతున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంటులో ప్రధానమంత్రిని నిలదీసి వరి పంటను కొనేలా చేస్తామన్నారు. కామారెడ్డి జిల్లాలో శుక్రవారం టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ మేరకు బిక్నూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో కల్లాల్లో కి రేవంత్ రెడ్డి వెళ్లి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కు పోయే కాలం వచ్చింది కాబట్టి రైతులతో పెట్టుకుంటున్నాడని అన్నారు. కేసీఆర్ ఏసీలో కూర్చొని ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడం కాదు, రైతుల కల్లాల్లోకి వచ్చి వరి కుప్ప పై కూర్చొని సమస్యలు అడిగి తెలుసుకోవాలని సూచించారు. 


దొంగ ధర్నాలతో తెలంగాణ ప్రజలను మోసం చేయలేరని రేవంత్ రెడ్డి అన్నారు. మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఉండే ఇప్పుడు రాష్ట్రంలో కేసీఆర్ ,బండి సంజయ్ లు డ్రామా యాక్షన్ కమిటీ మొదలెట్టారని ఎద్దేవా చేశారు.


కేసీఆర్ ఫాం హౌస్ లో కూర్చొని పరిపాలన చేయడం వల్లనే రైతులకు ఈ దుస్థితి పట్టిందని ఆరోపించారు. రైతుల సమస్యలు తెలుసుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అకాల వర్షాలతో రైతులు కల్లాల వద్ద ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు భరోసా ఇవ్వడానికి కల్లాల కాంగ్రెస్ పేరిట ఈ నెల 29 వరకు తెలంగాణ ప్రాంతం అంతటా పర్యటిస్తామన్నారు.



రోజులుగా ధాన్యం కుప్పల వద్ద ఉంటున్నామని, కొనుగోళ్లలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని రైతులు.. రేవంత్ కు వివరించారు. వద్దంటే వరిపంట సాగు చేశారని రైతులపై కేసీఆర్ కక్ష గట్టారని రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. బీజేపీ, టీఆర్ఎస్ లు నాటకాలాడుతున్నాయని ఫైర్ అయ్యారు. యూపీ ఎన్నికల కోసమే కేంద్రం రైతు చట్టాలను రద్దు చేసిందని అన్నారు. ప్రాణాలు పోయిన రైతు కుటుంబాలకు మోదీ క్షమాపణ చెప్పాలని, రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.


Also Read: Anantapur Rains: కదిరిలో కూలిన భవనాలు.. ముగ్గురు చిన్నారులు మృతి.. శిథిలాల్లో మరికొంత మంది


Also Read: Nagababu: అనాగరికం... సాటి మనుషులపై క్రూరత్వం... నీచ సంస్కృతికి దిగజారకండి - వైసీపీ తీరుపై నాగబాబు హాట్ కామెంట్స్