"మళ్లీ సీఎంగానే అసెంబ్లీకి వస్తా " అని చంద్రబాబు సవాల్ చేసి బాయ్ కాట్ చేశారు. అతి తక్కువ మంది సభ్యులే ఉన్నా అధికార పక్షం ప్రజాసమస్యల మీద మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలతో పాటు కుటుంబ సభ్యులపైనా దారుణ వ్యాఖ్యలు చేస్తూండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అసెంబ్లీల్లో ఇలా ప్రతిపక్ష నేతలను అవమానించడం వారు .. మళ్లీ సీఎం అయ్యాకే సభకు వస్తానని బాయ్ కాట్ చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ జయలలిత, ఎన్టీఆర్ అవమానాల కారణంగానే బాయ్ కాట్ చేశారు. సీఎంగానే సభలో అడుగుపెట్టారు. అవమానాలు కారణం కాదు కానీ రాజకీయ పరమైన నిర్ణయంతో ప్రస్తుత సీఎం జగన్ కూడా అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
Also Read : మళ్లీ గెలిచాకే అసెంబ్లీకి వెళ్తా.. కుటుంబాన్ని అవమానించారని విలపించిన చంద్రబాబు !
తమిళనాడు అసెంబ్లీలో జయలలితకు అవమానం.. ఛాలెంజ్ !
సినీ హీరోయిన్‌గా ఉన్న జయలలిత సామాన్య పార్టీ కార్యకర్తగా 1982లో రాజకీయాల్లోకి వచ్చారు. 1984లో రాజ్యసభ సభ్యురాల.్.ాపు, 1987లో ఎంజీఆర్ మరణించిన తరువాత తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష తొలి మహిళా నాయకురాలిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. 1989లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి సమక్షంలోనే అసెంబ్లీలో జయలలితకు తీరని అవమానం జరిగింది. కరుణానిధి పార్టీ డీఎంకే కి చెందిన సీనియర్ నాయకుడు దురై మురుగన్ అసెంబ్లీలోనే జయలలిత జుట్టుపట్టుకుని దాడి చెయ్యడానికి ప్రయత్నించి చీరలాగెయ్యడానికి విశ్వప్రయత్నం చేశారు. ఈ అవమానంతో కన్నీరు పెట్టుకున్న జయలలిత సభలోకి తాను ముఖ్యమంత్రిగానే అడుగుపెడుతానని చాలెంజ్ చేసి బయటకు వెళ్లిపోయారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమమంత్రిగానే సభలో అడుగు పెట్టారు.
ప్రతిపక్ష నేతగా ఎన్టీఆర్‌కు అవమానం ... అదే నిర్ణయం !
ఎన్టీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న జమ్మలమడుగు శివారెడ్డిని హైదరాబాద్‌లో దారుణంగా హత్య చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డిగా ఉన్నారు. శివారెడ్డి హత్య ఉదంతంపై ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదు. అసెంబ్లీలో మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. పదే పదే అవమానించేవారు. దీంతో ఓ సారి తీవ్రంగా అవమానించడంతో ఎన్టీఆర్ తన భుజంపై కండువాను తీసి తన సీట్లో ఉంచి.. మళ్లీ ముఖ్యమంత్రిగా మాత్రమే సభలోకి వస్తానని ప్రకటించి వెళ్లిపోయారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలోకి అడుగు పెట్టారు.
జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ బాయ్ కాట్ ...రాజకీయ నిర్ణయం !
ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. అయితే అసెంబ్లీలో ఎలాంటి అవమానం జరగలేదు కానీ.. పార్టీ మారిన తమ ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయలేదన్న కారణంగా ఆయన బాయ్ కాట్ చేశారు. దాదాపుగా రెండేళ్ల పాటు అసెంబ్లీకి హాజరు కాలేదు. సీఎం అయితేనే సభకు వస్తా అని జగన్మోహన్ రెడ్డి చాలెంజ్ చేయలేదు కానీ. సీఎంగానే సభలోకి అడుగు పెట్టారు.
Also Read : టీడీపీది హైడ్రామా..చంద్రబాబు కుటుంబాన్ని ఏమీ అనలేదన్న సీఎం జగన్ !
ఇప్పుడు చంద్రబాబునాయుడు సవాల్!
అత్యంత తీవ్రమైన పరిస్థితులలోనే పై ముగ్గురూ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయాలు తీసుకున్నారు. యాధృచ్చికమో లేకపోతే.. అలాంటి నిర్ణయాలు తీసుకుంటే సక్సెస్ అవుతారో కానీ ముగ్గురూ బాయ్ కాట్ చేసిన తర్వాత సీఎంగానే సభకు హాజరయ్యారు. అయితే మొదటి ఇద్దరూ అంటే ఎన్టీఆర్, జయలలిత తాము సభకు హాజరు కాకపోయినా తమ ఎమ్మెల్యేలను పంపేవారు. జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలను కూడా పంపలేదు. ఇప్పుడు చంద్రబాబు పంపుతారో లేదో క్లారిటీ లేదు. మొత్తానికి దక్షిణాది రాజకీయాల్లో పాదయాత్రలతో పాటు అసెంబ్లీ బహిష్కరణలు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి.
Also Read: నిరంతరం అందుబాటులో ఉంటా.. ఏం కావాలన్నా అడగండి.. సీఎం జగన్