స్టాక్ మార్కెట్లో ఏటా ఐపీవోలు వస్తూనే ఉంటాయి. కొన్ని ఎలాంటి అంచనాల్లేకుండా హిట్టవుతుంటాయి. మదుపర్లకు సంపదను సమకూర్చుతాయి. మరికొన్నేమో భారీ హైప్‌తో బరిలోకి దిగుతాయి. కంపెనీ విలువలో అంచనాలు తప్పి డిస్కౌంట్‌తో లిస్టవుతాయి. ఇప్పటి వరకు రూ.5000 కోట్లకు పైగా విలువతో మార్కెట్లో నమోదై తొలిరోజే భారీ నష్టాలను మిగిలించిన కంపెనీలు కొన్ని ఉన్నాయి.
- డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం రూ.18,300 కోట్ల విలువతో ఐపీవోకు వచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 9.30 శాతం డిస్కౌంట్‌తో నమోదైన ఈ కంపెనీ తొలిరోజు 27.25 శాతం నష్టంతో ముగిసింది. రూ.2150 విలువైన షేరు రూ.1,564 వద్ద ముగిసింది.
- అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పవర్ 2008లో రూ.11,700 కోట్ల విలువతో ఐపీవోకు వచ్చింది. 21.73 శాతం డిస్కౌంట్‌తో నమోదైంది. ఆఖర్లో కాస్త తేరుకొని 17.22 శాతం నష్టంతో ముగిసింది.
- ఇక కెయిర్న్ రూ.5,261 కోట్ల విలువతో ఐపీవోకు రాగా 12.50 డిస్కౌంట్‌తో లిస్టైంది. తొలిరోజు 14.06 శాతం ముగిసింది.
- ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ రూ.6,057 కోట్ల ఐపీవోతో భారీ అంచనాలతో వచ్చింది. 1.50 డిస్కౌంట్‌తో నమోదై తొలిరోజు 10.88 శాతం నష్టంతో ముగిసింది.
- ఇక రూ.10,341 కోట్ల విలువతో వచ్చిన ఎస్బీఐ కార్డ్స్ ఏకంగా 12.85 డిస్కౌంట్‌తో నమోదై తొలిరోజు 9.51 శాతం నష్టంతో ముగిసింది.
- న్యూ ఇండియా అష్యూరెన్స్ రూ.9,467 కోట్లతో ఐపీవోకు వచ్చింది. 6.39 శాతం డిస్కౌంట్‌తో నమోదై 9.37 శాతంతో ముగిసింది.
- నువోకో విస్టా రూ.5000 కోట్లతో ఐపీవోకు రాగా ఏకంగా 17.37 శాతం డిస్కౌంట్‌తో లిస్టైంది. ఆఖరికి 6.79 శాతం నష్టంతో ముగిసింది.
Also Read: Paytm Vijay Shekhar Sharma: 10 వేలతో మొదలై రూ.17వేల కోట్లకు విజయ్.. పేటీఎం ఫౌండర్ విజయ గాథ ఇది!
Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!
Also Read: Skoda Slavia: స్కోడా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ప్రీమియం ఫీచర్లు
Also Read: Pan Card Update: అర్జెంట్‌గా పాన్ కావాలా? ఇప్పుడు 10 నిమిషాల్లో వచ్చేస్తుంది
Also Read: Petrol-Diesel Price, 19 November: యథాతథంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరాల్లో మాత్రం పెరుగుదల..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి